AP Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు-northern coast of ap will receive light rains today imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు

AP Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు

Published Apr 28, 2024 06:58 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 28, 2024 06:58 AM IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఉదయం దాటితే ప్రజలు బయటికి రావటం లేదు. అయితే మండుతున్న ఈ ఎండల్లో ఏపీకి ఐఎండీ చల్లని కబురు చెప్పింది. వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో ఎండలు(AP Temperatures) తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఇవాళ(ఏప్రిల్ 28) 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Severe Heat Wave), 148 మండలాల్లో వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

(1 / 7)

(Photo Source From https://unsplash.com/)

రేపు ఆంధ్రప్రదేశ్ లోని (ఏప్రిల్ 29) 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 111 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ అధికారులు చెప్పారు.

(2 / 7)

శనివారం నంద్యాల(Nandyal) జిల్లా చాగలమర్రి(Chagalamarri)లో 45.9°C(ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత) తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేట, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2°C, విజయనగరం జిల్లా గజపతినగరం, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8°C, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4°C, శ్రీకాకుళం జిల్లా బూర్జ, పల్నాడు జిల్లా మాచెర్లలో 44.2°C, ఏలూరు జిల్లా దెందులూరులో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

(3 / 7)

ఓవైపు ఎండలు మండుతుండగా… ఏపీకి చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ, రేపు ఈ వర్షాలు ఉంటాయని తెలిపింది.

(4 / 7)

ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

(5 / 7)

ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం… ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు వర్ష సూచన లేదని వెల్లడించింది. సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద దక్షిణ ఛత్తీస్ ఘడ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీ, యానాంలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది.  

(6 / 7)

మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వడగాల్పుల హెచ్చరికలు జారీ కాగా…మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 1వ తేదీ వరకు వర్ష సూచన ఉందని తెలిపింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు