(1 / 6)
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు దిగివచ్చాయి.
(Photo Source https://unsplash.com/)(2 / 6)
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(Photo Source https://unsplash.com/)(3 / 6)
మే 17వ తేదీ నుంచి మే 18 ఉదయం 08. 30 గంటల వరకు చూస్తే.... ఆసిఫాబాద్,మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(Photo Source https://unsplash.com/)(4 / 6)
ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, ఖమ్మం,నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,జనగాం, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
(Photo Source https://unsplash.com/)(5 / 6)
తెలంగాణలో మే 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(Photo Source https://unsplash.com/)ఇతర గ్యాలరీలు