Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌.. మంగళగిరి తరలింపు-former ycp mp nandigam suresh arrested in hyderabad moved to mangalagiri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌.. మంగళగిరి తరలింపు

Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌.. మంగళగిరి తరలింపు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 05, 2024 06:58 AM IST

Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనల్లో నమోదైన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుదవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో బుధవారం సాయంత్రం నుంచి నిందితుల వేట మొదలైంది.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన అచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌ నుంచి మంగళగిరి తరలిస్తున్నారు. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఏం జరిగిందంటే….

వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఏపీ హైకోర్టు బుధవారం రిజెక్ట్‌ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్లను రిజెక్ట్‌ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచనల ప్రకారం నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు. రెండు వారాల పాటు గడువు ఇచ్చే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్టు పిటిషనర్లకు తెలిపింది. ఆ తర్వాత పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం వాటికి తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నాయకులు దేవినేని అవినాశ్, నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి.రమేష్‌, షేక్ రబ్బానీ భాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్‌ సహా మరికొందరికి బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నిరాకరించింది.

మరోవైపు మాజీ మంత్రి జోగిరమేష్‌ను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్‌తో పాటు 13మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ వీఆర్‌కే కృపా సాగర్‌ బుధవారం తీర్పునిచ్చారు.

సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోడానికి వీలుగా అరెస్టుల నుంచి రక్షణ కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చేసిన అభ్యర్థను కూడా కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నివాసం వద్ద ధర్నా పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడటాన్ని అమోదించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్కడకు వచ్చిన వారు ధర్నా పేరుతో ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయపడ్డింది.

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా రెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు సింగ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారుర. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. తుళ్లూరు మండలం ఉధ్దండరాయుని పాలెంలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి వెళ్లగా అప్పటికకే ఆయన పరారయ్యారు. దీంతో సాంకేతిక సాయంతో గాలించి ఆచూకీ కనుగొన్నారు.

Whats_app_banner