AP ECET Admissions: ఏపీ ఈసెట్‌లో ముగిసిన తుది దశ అడ్మిషన్లు, ఖాళీగా 20వేల సీట్లు-final stage admissions over in ap ecet 20 thousand seats vacant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet Admissions: ఏపీ ఈసెట్‌లో ముగిసిన తుది దశ అడ్మిషన్లు, ఖాళీగా 20వేల సీట్లు

AP ECET Admissions: ఏపీ ఈసెట్‌లో ముగిసిన తుది దశ అడ్మిషన్లు, ఖాళీగా 20వేల సీట్లు

Sarath chandra.B HT Telugu
Aug 09, 2024 06:55 AM IST

AP ECET Admissions: ఏపీ ఈసెట్‌ తుది దశ అడ్మిషన్లు ముగిశాయి. జులై 14లోగా అడ్మిషన్ల వివరాలను కాలేజీలు సాంకేతిక విద్యాశాఖలో నమోదు చేయాల్సి ఉంటుంది. తుదిదశ తర్వాత దాదాపు 20వేల సీట్లు మిగిలిపోయాయి.

ముగిసిన ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్లు
ముగిసిన ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్లు

AP ECET Admissions: ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్ 2024 తుదిదశ కౌన్సిలింగ్‌లో 20,969 సీట్లను భర్తీ చేశారు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాలకు నిర్ధేశించిన ఏపీ ఈసెట్ 2024 తుదిదశ సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు.

జులై నెల 9 నుండి 13వ తేదీ లోపు విద్యార్దులు అయా కళాశాలల్లో వ్యక్తిగత అన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు కళాశాలలో కూడా రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. తుదిదశ ప్రవేశాల అనంతరం 240 కళాశాలలలో 41922 సీట్లు ఉండగా , 20969 సీట్లను భర్తీ చేసినట్టు కన్వీనర్ వివరించారు.

రాష్ట్రంలోని 19 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2181 సీట్లు ఉండగా 1823 మంది సీట్లు పొందారు. 221 ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 39741 సీట్లకు 19146 సీట్లు భర్తీ చేశారు.

ఏపీ ఈసెట్ 2024 లో 32,881 మంది అర్హత సాధించగా, తుది దశ కోసం 2128 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2098 మంది అర్హత పొందారు. అయితే తుది దశలో అడ్మిషన్లు పొందిన సంఖ్య 4,890గా ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఆగస్టు 14లోపు భర్తీ అయిన సీట్లు, విద్యార్ధుల వివరాలను సాంకతిక విద్యా శాఖకు పొందుపరచవలసి ఉందని కన్వీనర్ వివరించారు.

ఏపీ ఈసెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ గత నెల 30న విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌, వెబ్ ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌ 2024 ద్వారా మూడేళ్ల డిప్లొమా విద్యార్ధులు, బిఎస్సీ మ్యాథ్స్‌ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బిటెక్‌ రెండో ఏడాదిలోప్రవేశాలు కల్పిస్తారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

పూర్తైన తొలి విడత అడ్మిషన్లు…

ఏపి ఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు , రిజిస్ట్రేషన్ కోసం జూన్ 26 నుండి 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. సర్టిఫికెట్ల అప్ లోడ్ కు జూన్ 27 నుండి జూలై 3 వరకు అనుమతించారు. జూలై 1 నుండి 4వ తేదీ వరకు ఆప్షన్స్ నమోదు, 5 న మార్పులకు అవకాశం ఉందని డాక్టర్ నవ్య పేర్కొన్నారు. సీట్ల ఎలాట్మెంట్ జూలై 8న చేయనుండగా, 9 నుండి 15 వరకు సెల్ఫ్ జాయినింగ్ , కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా , జూలై 10వ తేదీ నుండే క్లాసులు ప్రారంభం అయ్యాయి.

ఏపీ ఈసెట్‌ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడేళ్ల డిప్లొమా, బిఎస్సీ మ్యాథ్స్ విద్యార్ధులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడానికి వెబ్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ జూన్‌ 26 నుంచి తొలిదశ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. వెబ్‌ కౌన్సిలింగ్‌లో పేమెంట్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్‌, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌, ఆప్షన్లను నమోదు చేయనున్నారు.

జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు మొదటి విడత అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఏపీ ఈసెట్‌2024లో అర్హత సాధించిన డిప్లొమా, బిఎస్సీ డిగ్రీ విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్...

జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, విద్యార్థి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.

జూన్ 27 నుంచి జూలై 3వ తేదీ వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

జూలై 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేస్తారు.

జూలై 5న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అనుమతిస్తారు.

జూలై 8న సీట్ అలాట్మెంట్ చేస్తారు.

జూలై 9 నుంచి 15వ తేదీ వరకు విద్యార్ధులు ఎంపిక చేసుకున్న కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 10 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి వివరాల కోసం ఈసెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://ecet-sche.aptonline.in/ECET/Views/index.aspx