AP Gurukula Results: డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. మార్చి 22న మొదటి దశ ఎంపికలు…
AP Gurukula Results: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకుల ఆధారంగా మార్చి 22 శుక్రవారం మొదటి దశలో విద్యార్ధుల్ని ఎంపిక చేయనున్నారు.
AP Gurukula Results: ఆంధ్రప్రదేశ్ డా బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో APSWREIS ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరయ్యారు.
రాష్ట్రంలోని వివిధ క్యాంపస్లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 22న March22 ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక ఉంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కార్యదర్శి వెల్లడించారు.
డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల ప్రకటించారు.
5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి వివరించారు.
ప్రవేశపరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీలలో విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను http.//apbragcet.apcfss.in నుంచి తెలుసుకోవచ్చన్నారు.
పరీక్షలకు హాజరైన విద్యార్ధుల మెరిట్ లిస్ట్ ఆధారంగా 22 మార్చి 2024 న మొదటి దశ విద్యార్ధుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో జరుగుతుందని, మిగిలిన ఖాళీలను ఆధారంగా జోన్ ల వారీగా తర్వాత దశలో ఎంపికలు ఉంటాయని చెప్పారు.
పదో తరగతి పరీక్షలకు 96.86 శాతం విద్యార్థులు హాజరు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా మూడో రోజు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3473 కేంద్రాల్లో 6,51,607 మంది విద్యార్థులకు గానూ 6,30,468 (96.86% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 17,274 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.
అన్ని జిల్లాల్లో 1348 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షా కేంద్రాలను సందర్శించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం