CM Jagan to VSKP: నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సిఎం జగన్ పర్యటన-cm jagans visit to visakhapatnam and anakapalli districts today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan To Vskp: నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సిఎం జగన్ పర్యటన

CM Jagan to VSKP: నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సిఎం జగన్ పర్యటన

Sarath chandra.B HT Telugu
Oct 16, 2023 06:00 AM IST

CM Jagan to VSKP: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటారు.

నేడు విశాఖపట్నంకు సిఎం జగన్
నేడు విశాఖపట్నంకు సిఎం జగన్

CM Jagan to VSKP: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు. విశాఖలో ఇన్ఫోసిస్‌ నూతనంగా నిర్మించిన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్‌ డిజైన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్‌ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు.

yearly horoscope entry point

దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

అనకాపల్లి జిల్లా పర్యటన

పరవాడ ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్ ప్రారంభోత్సవంలో సిఎం పాల్గొంటారు. ఫార్మా, బయెటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌

యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.

లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌

అచ్యుతాపురం ఏపీ సెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు లారస్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.

Whats_app_banner