JVVD Funds Release: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్-cm jagan will release jagannas foreign education funds today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jvvd Funds Release: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్

JVVD Funds Release: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్

Sarath chandra.B HT Telugu
Dec 20, 2023 06:24 AM IST

JVVD Funds Release: జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్దిదారులకు నిధులను నేడు సిఎం జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లి నుంచి లబ్దిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు.

నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిదులు విడుదల  (ఫైల్)
నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిదులు విడుదల (ఫైల్)

JVVD Funds Release: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించే జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్దిదారులకు నిధులను నేడు విడుదల చేయనున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందించే ఆర్ధిక సహాయం అందించనున్నారు.

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సా సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలను మొత్తం రూ. 42.60 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తారు.

సివిల్ సర్వీస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ. 1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ. 50 వేల ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతో పాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటు నందిస్తూ.. ఎలాంటి పరిమితి లేకుండా అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు.

గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలు చేశారని, తమ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావు లేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధి చేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోందని చెబుతున్నారు.

జగనన్న విదేశీ విద్యాదీవెన

కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ / టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలలో టాప్-50 ర్యాంకుల్లో ఉన్న కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నారు.

విద్యార్ధులకు విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా చెల్లిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచంలోని టాప్ 320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువు కునేందుకు ఏపీ విద్యార్థులకు అవకాశం లభిస్తోంది. గడిచిన 10 నెలల్లో కేవలం "జగనన్న విదేశీ విద్యాదీవెన" క్రింద 408 మంది విద్యార్థులకు మొత్తం రూ. 107.08 కోట్లు ఆర్ధిక సాయం అందించారు. విదేశీ విద్యాదీవెనలో మరిన్ని వివరాల కోసం https://jnanabhumi.ap.gov.in ను సందర్శించండి..

Whats_app_banner