Visakha Cable Technician: బంగారు గొలుసు కోసం కేబుల్ టెక్నిషియన్ కిరాతకం.. విశాఖలో దారుణం
Visakha Cable Technician: బంగారు గొలుసు కోసం కేబుల్ టెక్నిషియన్ కిరాతకంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాడు.
Visakha Cable Technician: విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెం గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే కిరాతకం వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు అపహరించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
గవరపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇంట్లో సోఫాలో కూర్చుని ఉండగా లోపలకు వచ్చిన వ్యక్తి ఆమె వెనుకగా వెళ్లి తువ్వాలుతో ఆమె మెడను బిగించి గొలుసు చోరీకి ప్రయత్నించాడు.
చోరీకి పాల్పడిన నిందితుడు గోవింద్ కేబుల్ టెక్నీషియన్ కావడంతో తరచూ పని నిమిత్తం ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తించిన గోవింద్ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆమె బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నం చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని గవరపాలెంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. కేబుల్ టెక్నీషియన్ బంగారు గొలుసు దొంగిలించే ప్రయత్నంలో గత వారం వృద్ధురాలిని ఆమె ఇంట్లో గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు.
ఈ సంఘటన జనవరి 26వ తేదీ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నిందితుడు సోఫాలో కూర్చున్న 67 ఏళ్ల మహిళ మెడకు టవల్ చుట్టడంతో విడిపించుకోడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించింది. ఆ తర్వాత హత్య చేయాలనే ఉద్దేశంతో ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు గొలసు ఇచ్చేస్తానని వేడుకుంటున్న దృశ్యాలు చూపరుల్ని కలిచి వేశాయి.
హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు గోవింద్ స్థానికంగా క కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కేబుల్ డబ్బులు, రిపేర్ల కోసం తరచుగా పని కోసం మహిళ ఇంటికి వస్తుడంటంతో అతని రాకను ఆమె అనుమానించ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తించిన గోవింద్ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆమె బంగారు గొలుసు దొంగిలించే ప్రయత్నం చేశాడు.
బాధితురాలి మెడలో ఆరు తులాల బంగారు గొలుసు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన తర్వాత వృద్ధురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వృద్ధురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) మరియు 394 (దోపిడీ) కేసులు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.