AP Bjp Street Meets : రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ మీటింగ్స్
AP Bjp Street Meets ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలోకి ఏపీ బీజేపీ ప్రవేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీధి సమావేశాలకు ఆ పార్టీ ప్రారంభించింది. ఏపీ వ్యాప్తంగా 5వేల ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. విజయవాడ శివాజీ కేఫ్ సెంటర్ నుంచి వీధి సమావేశాలు ప్రారంభించిన సోము వీర్రాజు ప్రతి జిల్లాలో 50 సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వట్లేదని, సీఎం నివాసం వద్ద కూడా ఆందళన చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, – మోదీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
AP Bjp Street Meets రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ప్రారంభించింది. అభివృద్ధి నిరోధక వైసిపి ప్రజా విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరు పేరుతో సభలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల సభల ద్వారా జగన్ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ను వివరించాలని నిర్ణయించినట్లు సోము వీర్రాజు ప్రకటించారు.
విజయవాడ సత్యనారాయణ పురంలో ప్రజా పోరు యాత్ర, సభను సోము వీర్రాజు ప్రారంభించారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా పోరు యాత్ర చేపట్టినట్టు చెప్పారు. సిఎం అయ్యాక జగన్ ప్రజల్లోకి రావడమే మానేశారని, అప్పుడప్పుడు అసెంబ్లీ లో మాత్రమే జగన్ కనిపిస్తారని విమర్శించారు. అసెంబ్లీ ని కూడా అబద్దాలకు కేంద్రం గా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ఇసుక ఉచితంగా దొరుకుతుంది, సామాన్యులకు మాత్రం చౌకగా రాదని AP Bjp Street Meetsలో సోము వీర్రాజు ఆరోపించారు. టిడిపి హయాంలో అయినా కొంత ధర తక్కువగా వచ్చిందని చెప్పారు. బంగారం అయినా ఎక్కడైనా దొరుకుతుందని, రాష్ట్రంలో మాత్రం ఇసుక దొరకదని విమర్శించారు. జగన్ తనకు సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా, ఏపీలో ధర పెంచేశారని ఆరోపించారు. చంద్రబాబు కన్నా గొప్పపాలన చేస్తానని ప్రజలను నమ్మించాడని, ఆచరణలో మాత్రం విఫలమయ్యాడని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు వెచ్చించే సొమ్ము కేంద్రానిది అయితే... సోకు జగన్ ది అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. ఎయిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభమై మూడేళలు గడుస్తున్నా ఇప్పటికీ నీటి సమస్య తీరలేదని ఆరోపించారు. ఎయిమ్స్‌కు జగన్ నీటి సరఫరా ఇవ్వకపోవడంపై పోరు యాత్ర తరువాత జగన్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు.
చంద్రబాబు, జగన్ లు రాజధాని కట్టకపోవడం వల్లే నేడు రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చిందని సోము చెప్పారు. బలమైన నేత మోడీనా, చంద్రబాబా, జగనా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రెండు కుటుంబ పార్టీ లను దూరంగా పెడితేనే ఎపి బాగు పడుతుందని, ఈ ప్రభుత్వానికి బటన్ నొక్కడం, మనల్ని తాకట్టు పెట్టడమే ప్రధానమైందని ఆరోపించాచు.
కేంద్రం అమలు చేసే పధకాలకు జగనన్న పేరు పెట్టుకుని జైజైలు కొట్టించుకుంటారని విమర్శించారు. వ్యాన్ లలో యాత్ర లు చేయాలంటే తండ్రి, కొడుకు, జగనన్న రావాలని, బీజేపీలో కార్యకర్తలే యాత్ర లు చేస్తారని చెప్పారు. తమది ి కుటుంబ పార్టీ కాదని స్టిక్కర్ పార్టీ అంతకంటే కాదన్నారు. పోలవరం గురించి జగన్ అసెంబ్లీ సాక్షి గా అబద్దాలు చెబుతున్నారని, నిర్వాసితులకు సంబంధించిన లెక్కలు కేంద్రానికి అప్పగించ లేదన్నారు. తమ తప్పులు చెప్పకుండా కేంద్రం పై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యే లకు దమ్ముంటే మా ముందుకు వచ్చి అభివృద్ధి పై చర్చ పెట్టాలపి డిమాండ్ చేశారు.