AP BJP : వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ పోరు… సోము వీర్రాజు-bjp will fight against ysrcp government in ap says somu veeraju ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp : వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ పోరు… సోము వీర్రాజు

AP BJP : వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ పోరు… సోము వీర్రాజు

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 01:51 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం నుంచి గణనీయంగా సాయం అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలొ ఈ నెల 21వ తేదీ విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.

వాజ్‌పాయ్‌కు నివాళులు అర్పిస్తున్న సోము వీర్రాజు
వాజ్‌పాయ్‌కు నివాళులు అర్పిస్తున్న సోము వీర్రాజు

బిజెవైఎం సంఘర్షణ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చామని సోము వీర్రాజు చెప్పారు. ఏపీలో వైసీపీది బుర్ర లెని ప్రభుత్వంమని విమర్శించారు. నేచుర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చెసిందని విమర్శించారు. బటన్ నొక్కడం పనిగా ప్రభుత్వం పని చేస్తోందని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రానికి 35 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే వాటిని ఇప్పటి వరకూ పూర్తి చెయ్య లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను తమ సొంత ఖాతాలో నుంచి ఇచ్చినట్లు బటన్ నొక్కి పంచుతున్నారని విమర్శించారు.

చెన్నై,హైదరాబాద్, బెంగుళూరు కారిడార్స్ కేంద్రం ఇచ్చిందని, కేంద్రం రాజధానీ కోసం నిధులు ఇస్తే ఏపికి రాజదాని లేకుండ చేశారని విమర్శించారు. ప్రత్యెక ప్యాకేజీ ఇస్తే నిధులు తీసుకోలేకపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలకు నిధులు ఇస్తే అది రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందన్నారు. విద్య, వైద్యం విషయంలో కేంద్రం ఇతోధిక సహకారాన్ని అందిస్తొందన్నారు.

ఘనంగా వాజ్‌పాయ్‌ వర్ధంతి

భారత మాజీ ప్రధాని వాజ్ పాయ్ వర్ధంతి కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. వాజ్‌పాయ్‌ కర్మచారి కమిషన్ వేసి అట్టడుగున ఉన్న ప్రజల జీవితాలకు వెలుగును ప్రసాదించారని కొనియాడారు. ప్రధాని వాజ్ పేయ్ విజ్ఞాన్‌ అనే నినాదాన్ని తీసుకుని దేశాభివ్రుద్దికి మార్గనిర్ధేశం చేశారన్నారు. పోఖ్రాన్‌ అణుపరీక్షలు తర్వాత భారత శక్తి సామర్ధ్యాలు చూసి అమెరికా సైతం నివ్వెర పోయిందన్నారు. నదులు, రహదారుల అను సంధానానికి మార్గ దర్శకులు వాజ్‌పాయ్‌ అని కొనియాడారు. దేశంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చిన మహానేత వాజపేయి అని ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లు తీసుకొచ్చింది ఆయనే అన్నారు. బడుగు బలహీనర్గాల అభివృధి కోసం దేశ వ్యాప్తంగా ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు నేడు మంచి ఫలితాలని ఇస్తున్నాయని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్