Tirupathi Minor Girl: తిరుపతి జిల్లాలో ఘోరం, మైనర్‌ బాలికను అపహరించి.. హత్య చేసిన బీహార్‌ కూలీ-bihar laborer who abducted and murdered a minor girl in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupathi Minor Girl: తిరుపతి జిల్లాలో ఘోరం, మైనర్‌ బాలికను అపహరించి.. హత్య చేసిన బీహార్‌ కూలీ

Tirupathi Minor Girl: తిరుపతి జిల్లాలో ఘోరం, మైనర్‌ బాలికను అపహరించి.. హత్య చేసిన బీహార్‌ కూలీ

Sarath chandra.B HT Telugu
Jul 18, 2024 07:03 AM IST

Tirupathi Minor Girl: తిరుపతిలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్‌ బాలికను అపహరించిన దుర్మార్గుడు హత్య చేశాడు.

తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలికను హత్య చేసిన బీహార్‌ కూలీ
తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలికను హత్య చేసిన బీహార్‌ కూలీ

Tirupathi Minor Girl: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబలిలో దారుణ ఘటన జరిగింది. నెలబల్లి సమీపంలో ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలీ పనులు చేస్తున్నారు. వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, బుధవారం మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్‌కు చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూశారు.

తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు,

బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందుతుడు బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

బిస్కెట్లు ఇస్తానని తీసుకెళ్లి…

బిస్కెట్లు ఇస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బిహార్‌ నుంచి వచ్చిన లల్లూకసదా, పిటియాదేవి దంపతుల రెండో కుమార్తెగా గుర్తించారు.

నెలబల్లి రైస్‌ మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్‌(20) బాలికకు బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయంలో మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోయే సరికి ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర కార్మికులతో కలిసి వెదికారు. సాయంత్రం 4 గంటల సమయంలో రైస్‌ మిల్లుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు తోలుకుంటూ వెళ్లిన వారికి బాలిక మృతదేహం కనిపించింది. దీంతో వారు స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాలిక శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాయుడుపేట ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలికను నిందితుడు దిలీప్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు రైస్‌ మిల్లు సీసీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాలికకు బిస్కెట్లు కొనివ్వడానికి తనతో తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదని పోలీసులకు చెబుతుండటంతో గంజాయి మత్తులో నేరం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

మంగళవారం రాత్రి నిందితుడు దిలీప్‌‌కు బాలిక తండ్రికి గొడవ జరిగినట్టు ఇతర కూలీలు చెబుతున్నారు. తండ్రిపై కోపంతో బాలికను హత్య చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

Whats_app_banner