Fake IT Raids: పట్టపగలే 12 కిలోల బంగారం దోపిడీకి యత్నం-attempted big robbery in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fake It Raids: పట్టపగలే 12 కిలోల బంగారం దోపిడీకి యత్నం

Fake IT Raids: పట్టపగలే 12 కిలోల బంగారం దోపిడీకి యత్నం

Mahendra Maheshwaram HT Telugu
Aug 26, 2022 10:01 PM IST

robbery attempt in nellore: నెల్లూరులో ఐటీ రైడ్స్ అంటూ నానా హంగామా చేసి దొరికిపోయింది ఓ ముఠా. ఏకంగా కోటిన్నర సోమ్మును సింపుల్ గా కొట్టేసే అంత పని చేశారు. కానీ సిబ్బంది అలర్ట్ కావటంతో... వీరి బాగోతం బట్టబయలైంది.

<p>నెల్లూరు జిల్లాలో దోపిడీకి యత్నం</p>
నెల్లూరు జిల్లాలో దోపిడీకి యత్నం

Robbery Attempted in Nellore: ఒక్కసారిగా స్పీడ్ గా జ్యూవెలరీ షాప్ లోకి వచ్చేశారు..! ఐటీ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. దుకాణంలోని బంగారాన్ని లెక్కగట్టారు..! లెక్కల్లో కంటే ఎక్కువ ఉందంటూ వీర లెవల్ ల్ ఒవర్ యాక్షన్ చేసేశారు. అంతేనా తీరా ముట్టగట్టుకొని జారుకునే క్రమంలో... అక్కడి సిబ్బంది అలర్ట్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే వచ్చినోళ్లంతా కటకటలాపాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు నగరంలో సంచలనంగా మారింది.

ఏం జరిగిందంటే...

నెల్లూరు నగరంలోని ఓ వీధిలోని జ్యువెల్లరీ షాప్‌లోకి శుక్రవారం ఐటీ అధికారులమంటూ ఆరుగురు వ్యక్తులు వచ్చారు. తనిఖీలు చేయాలంటూ దుకాణంలో హడావుడి చేశారు. లెక్కల్లో కంటే ఎక్కువ బంగారం ఉందని సుమారు రూ.కోటిన్నర విలువైన 12 కిలోల బంగారాన్ని ఓసంచిలో పెట్టారు. అదే స్పీడ్ తో అక్కడ్నుంచి జారుకునేందుకు యత్నించారు. వారి తీరుపై అనుమానం వచ్చిన దుకాణం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది గమనించిన ముఠా... పరారీ అయ్యేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని చితకబాదారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా చోరీలకు మరెక్కడైనా పాల్పడ్డారా....?గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. అయితే పట్టపగలే సినిమాలో చూపించే రేంజ్ లో ఘటన చోటు చేసుకోవటం నగరంలో సంచలనం సృష్టిస్తోంది.

Whats_app_banner