Fake Universities: ఈ యూనివ‌ర్సిటీలు ఫేక్‌.. యూజీసీ నిర్ధార‌ణ‌.. ఏపీలోనూ ఒక‌టి-ugc releases list of 21 fake universities in delhi and 8 other states ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ugc Releases List Of 21 Fake Universities In Delhi And 8 Other States

Fake Universities: ఈ యూనివ‌ర్సిటీలు ఫేక్‌.. యూజీసీ నిర్ధార‌ణ‌.. ఏపీలోనూ ఒక‌టి

HT Telugu Desk HT Telugu
Aug 26, 2022 05:35 PM IST

దేశవ్యాప్తంగా 21 యూనివ‌ర్సిటీల‌ను నకిలీ వ‌ర్సిటీలుగా యూజీసీ(University Grants Commission - UGC) నిర్ధారించింది. ఈ యూనివ‌ర్సిటీల్లో అత్య‌ధికం ఢిల్లీలోనే ఉన్నాయి.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Fake Universities: న‌కిలీ యూనివ‌ర్సిటీల జాబితాను యూజీసీ వెల్ల‌డించింది. అత్య‌ధికంగా ఢిల్లీలో, ఆ త‌రువాత యూపీలో న‌కిలీ వ‌ర్సిటీలు అధికంగా ఉన్నాయి. అలాగే, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, పుదుచ్చేరి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లోనూ న‌కిలీ వర్సిటీలున్నాయ‌ని యూజీసీ వెల్ల‌డించింది. ఈ వ‌ర్సిటీలు యూజీసీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయ‌ని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Fake Universities: ఢిల్లీలో 9

యూజీసీ నిర్ధారించిన మొత్తం 21 న‌కిలీ వ‌ర్సిటీల్లో ఎనిమిది ఢిల్లీలో ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 4, ప‌శ్చిమ‌బెంగాల్, ఒడిశాల్లో రెండు చొప్పున‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, పుదుచ్చేరి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లో ఒక్కొక్క‌టి చొప్పున న‌కిలీ యూనివ‌ర్సిటీల‌ను యూజీసీ గుర్తించింది. ఈ వ‌ర్సిటీలు ఇచ్చే డిగ్రీల‌కు ఎటువంటి గుర్తింపు లేద‌ని స్ప‌ష్టం చేసింది. డిగ్రీల‌ను ప్ర‌దానం చేసే అర్హ‌త ఆ యూనివ‌ర్సిటీల‌కు లేద‌ని తెలిపింది. ఈ వ‌ర్సిటీల‌న్నీ గుర్తింపు లేని విద్యా సంస్థ‌ల‌ని తెలిపింది.

Fake Universities: ఏపీలోని క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ కూడా ఫేక్‌

యూజీసీ ప్ర‌క‌టించిన న‌కిలీ యూనివ‌ర్సిటీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక విశ్వ‌విద్యాల‌యం కూడా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌`క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ(Christ New Testament Deemed University) కి యూజీసీ గుర్తింపు లేద‌ని, డిగ్రీల‌ను ప్ర‌దానం చేసే అర్హ‌త ఆ యూనివ‌ర్సిటీకి లేద‌ని యూజీసీ స్ప‌ష్టం చేసింది. అలాగే ఢిల్లీలోని All India Institute of Public and Physical Health Sciences (AIIPPHS), Commercial University Ltd., United Nations University, Vocational University, ADR-Centric Juridical University, Indian Institution of Science and Engineering, Viswakarma Open University for Self-employment and Adhyatmik Vishwavidyalaya (Spiritual University) యూనివ‌ర్సిటీలు కూడా ఫేక్ అని పేర్కొంది.

Fake Universities: క‌ర్నాట‌క‌లో

క‌ర్నాట‌క‌లో Badaganvi Sarkar World Open University Education Society, కేర‌ళ‌లో t. John's University, Kishanattam, మ‌హారాష్ట్ర‌లో Raja Arabic University, Nagpur, పుదుచ్చేరిలో ree Bodhi Academy of Higher Education న‌కిలీవ‌ని తేల్చింది. ఒడిశాలో The Nababharat Shiksha Parishad and North Orissa University of Agriculture and Technology ల‌ను, ప‌శ్చిమ‌బెంగాల్‌లో ndian Institute of Alternative Medicine and Institute of Alternative Medicine and Research are the fake university ల‌ను ఫేక్ వ‌ర్సిటీల‌ని నిర్ధారించింది.

Fake Universities: యూపీలో..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో Gandhi Hindi Vidyapith, Prayag; National University of Electro Complex Homeopathy, Kanpur; Netaji Subhash Chandra Bose University and Bhartiya Shiksha Parishad, Bharat Bhawan వ‌ర్సిటీల‌కు గుర్తింపు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

WhatsApp channel