Compassionate Appointments: ఉపాధ్యాయ కారుణ్య నియామాకాలు చేపట్టాలని ఏపీజేఏసీ డిమాండ్-apjac demands compassionate appointments in the families of dead teachers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Compassionate Appointments: ఉపాధ్యాయ కారుణ్య నియామాకాలు చేపట్టాలని ఏపీజేఏసీ డిమాండ్

Compassionate Appointments: ఉపాధ్యాయ కారుణ్య నియామాకాలు చేపట్టాలని ఏపీజేఏసీ డిమాండ్

Sarath chandra.B HT Telugu
Feb 01, 2024 02:29 PM IST

Compassionate Appointments: జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాద్యాయుల కుటుంబాల్లో అర్హత కలిగిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ప్రభుత్వం కారుణ్య నియామాకాలు చేపట్టాలని ఏపీజేఏసీ డిమాండ్ చేసింది.

ఉపాధ్యాయ కారుణ్య నియామకాలకు బొత్స సానుకూలం
ఉపాధ్యాయ కారుణ్య నియామకాలకు బొత్స సానుకూలం

Compassionate Appointments: జిల్లా పరిషత్ పరిధిలో కారుణ్య నియామాకాలు వెంటనే చేపట్టి ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణని జేఏసీ అమరావతి నాయకులు వినతి పత్రం సమర్పించగా మంత్రి అందుకు సానుకూలంగా స్పందించారు.

జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు కోవిడ్ ముందు, కోవిడ్ సమయం లోను,కోవిడ్ తర్వాత అనేక మంది చనిపోయినా గత ఆరేడు సంవత్సరాలుగా ఎలాంటి కారుణ్య నియామకాలు చేపట్టక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని మంత్రికి వివరించారు.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జిల్లా పరిషత్ పరిధిలో చనిపోయిన ఉద్యోగులు / టీచర్ల కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి జిల్లా పరిషత్ పరిధిలో మాత్రమే కారుణ్య నియామకాలు కల్పించాల్సి ఉందన్నారు. మిగిలిన శాఖలలో పనిచేసే ఉద్యోగులకు వారి శాఖలలో ఖాళీలు లేక పోతే, ఇతర శాఖలలో ఖాళీలు ఉండి, తగిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని, జిల్లా పరిషత్ పరిధిలో తగిన ఖాళీలు లేనందున గత ఆరేడు సంవత్సరాలుగా ఎలాంటి కారుణ్య నియామకాలు చేపట్టలేదని వివరించారు.

ఫలితంగా వారి కుటుంబాలు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేలా వారందరికీ కారుణ్యనియామాకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్ఛి ప్రభుత్వం ఆదుకోవాలని, ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర హెడ్ మాస్టర్లు సంఘం పక్షాన గత ఏడాది జూలై 27వ తేదీన కూడా లేఖ ఇచ్చినట్టు తెలిపారు.

ఏపీ జేఏసీ అమరావతి పక్షాన 92 రోజు పాటు జరిగిన ఉద్యమంలో కూడా ప్రభుత్వ పెద్దలు దృష్టికి ఆయా సమావేశాల్లో తీసుకొని వచ్ఛినప్పుడు తప్పకుండా చేస్తామని ఇచ్చిన హామి ఇచ్చిన మేరకు ఈ కుటుంబాలను ఆదుకొనేలా కారుణ్య నియామాకాలు వెంటనే చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ కారణంగా రాష్ట్రంలో చనిపోయిన అన్ని శాఖల ఉద్యోగుల (ఆర్టీసీతో సహా) కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించారని అదే పద్ధతిలో రాష్ట్రంలో కోవిడ్ ముందు, కోవిడ్ సమయం, కోవిడ్ తర్వాత చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు కుటుంబం లో అర్హత కలిగిన సభ్యులకు కూడా తక్షణమే కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు.

బొత్స సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరపున చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

Whats_app_banner