APBRAG Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి-apbrag 5th admission notification released fro 2023 2024 academic year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apbrag Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

APBRAG Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 08:16 PM IST

DR.B.R.Ambedkar Gurukulams: ఏపీలోని గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది.5వ తరగతిలో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, దరఖాస్తు విధానంతో పాటు పలు అంశాలను ఇందులో పేర్కొంది.

గురుకులాల్లో అడ్మిషన్లకు ప్రకటన
గురుకులాల్లో అడ్మిషన్లకు ప్రకటన

APBRAG 5th Admission Notification: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఒక్కొక్కటిగా ప్రవేశ నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేష విడుదల చేశారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలవగా... ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ముఖ్య సూచనలు ఇవే:

వయో పరిమితి: ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2010-ఆగస్టు 31, 2014 మధ్య ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు సెప్టెంబర్ 1, 2012, ఆగస్టు 31, 2014 మధ్య జన్మించి ఉండాలి.

అర్హతలు: అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న విద్యాసంవత్సరంలో నాలుగవ తరగతి విద్యార్థి అయి ఉండాలి. సదరు విద్యార్థి వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి.

రిజ్వేషన్ వివరాలు - ఎస్సీలకు 75 శాతం, బీసీలకు ఐదు శాతం, ఎస్టీలకు 6 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏదైనా కేటగిరిలో భర్తీకాని సీట్లను ఎస్సీ విద్యార్థులకే కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం - ఆసక్తి గల అభ్యర్థులు https://apgpcet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

-దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు.

-అభ్యర్థులు సమీపంలోని ఏదైనా ఇంటర్నెట్ సంటర్ ద్వారా లేదా దగ్గరలోని Dr.B.R అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

తుది గడువు - మార్చి, 24, 2023

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటిమ్ మార్కులు లేవు.

కింద ఇచ్చిన పీడీఎఫ్ లో జిల్లాల వారీగా గురుకులాల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వీటితో పాటు పూర్తి నోటిఫికేషన్ కూడా చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం