AP TET 2024 Updates : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసుకోండి-ap tet mock test options 2024 are now available at https aptet apcfss in details read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Updates : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసుకోండి

AP TET 2024 Updates : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసుకోండి

AP TET Exams 2024 Updates : ఏపీ టెట్ - 2024కు దరఖాస్తు చేశారా..? అయితే మీరు ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అవకాశాన్ని కల్పించింది. ఈ పరీక్షలను ఉచితంగా ఎలా రాయాలో ఈ కథనంలో చూడండి…

ఏపీ టెట్ పరీక్షలు 2024

ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని తాజాగా కూడా స్పష్టం చేసింది. వాయిదా పడుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది. అయితే తాజాగా మాక్ టెస్టులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ పరీక్షలను ఉచితంగా రాసుకోవచ్చు. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

మరోవైపు పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్‌ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న ఏపీ టెట్ - 2024 తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తాయి.

టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.

మరోవైపు కీలకమైన డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో…. టెట్ స్కోరు కీలకంగా మారింది. కేవలం స్కోర్ మాత్రమే కాదు… చాలా మంది క్వాలిఫై కావటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతున్నప్పటికీ పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఏపీ టెట్ మాక్ టెస్టులు ఇలా రాసుకోవచ్చు….

  • ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో పైన కనిపించే Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీకు సబ్జెక్టుల పేర్లు డిస్ ప్లే అవుతాయి. దాని పక్కన ఉండే Access URLపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  • ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
  • ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

సంబంధిత కథనం