AP Model School Admissions : అలర్ట్... ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?-ap model schools admissions 2024 applications last date extended check the key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Model Schools Admissions 2024 Applications Last Date Extended Check The Key Dates Are Here

AP Model School Admissions : అలర్ట్... ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 29, 2024 09:07 PM IST

AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి మరో అప్డేట్ అందింది. మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో… గడువు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు

AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలో(AP Model Schools Admissions) ఆరో తరగతి ప్రవేశాల గడువును పొడిగించింది పాఠశాల విద్యాశాఖ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. అయితే ఈ గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 21వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.

ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06 ఏప్రిల్ .2024.

పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)

అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/

అప్లికేషన్ లింక్ - https://apms.apcfss.in/StudentLogin.do

ఇంటర్ ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం….

APMS Inter Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను పేర్కొంది. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం పరీక్ష రాసే వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

అడ్మిషన్ల ప్రకటన - ఏపీ మోడల్ స్కూల్

ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్

ఏపీలోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.

అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అప్లికేషన్ ఫీజు - ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 28, 2024.

దరఖాస్తులకు తుది గడువు - మే 22, 2024.

ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.

అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/

IPL_Entry_Point

సంబంధిత కథనం