Chandrababu Bail Rejected: చంద్రబాబు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన హైకోర్టు
Chandrababu Bail Rejected: ఏపీ హైకోర్టులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు ఘర్షణలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాముల్లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.
Chandrababu Bail Rejected: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అంగళ్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసుల్లో బాబు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నారు. ఫైబర్ నెట్ కేసులో ఏ25గా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేశారు. సోమవారం బాబు పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఫైబర్ నెట్, IRR, అంగళ్ళు కేసుల్లో చంద్రబాబు నాయుడు నిందితుడిగా పరిగణించాలనే పిటిషన్లు దిగువ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ముందే బెయిల్ మంజూరు చేయడం సరికాదన్న సిఐడి వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్లతో పాటు మిగిలిన కేసుల్లో బాబును నిందితుడిగా చేర్చాలనే పిటిషన్లపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.