TG Employee Relieved : తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ-ap govt orders to relieve 122 non gazette telangana employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tg Employee Relieved : తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

TG Employee Relieved : తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2024 07:35 PM IST

TG Employee Relieved : తెలంగాణ స్థానికత కలిగి ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జీవో జారీ చేసింది. విభజన సమయంలో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు.

తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

TG Employee Relieved : ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్థానికత కలిగి ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 122 మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణ పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రీలీవ్‌ చేసిన ఉద్యోగులు తమ కేడర్‌ చివరి ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ, తెలంగాణ సీఎం జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల వినతులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఏపీ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో పనిచేస్తు్న్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు గతంలో పలుమార్లు ఏపీ ప్రభుత్వానికి వినతలు అందించాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత ఉన్న కొందరు ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. వారిలో కొంతమంది తెలంగాణకు వెళ్లగా, మిగిలిన వారు ఏపీలో పనిచేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా తమ సమస్యలను పరిష్కరించలేదని ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణకు చెందిన 144 మంది ఉద్యోగులు ఏపీలో పని చేస్తున్నారని, వారిని రిలీవ్ చేయాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఇటీవల ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఏపీ సీఎస్‌ను మర్యాదపూర్వకంగా టీఎన్జీవో సంఘం నేతలు..ఉద్యోగుల రిలీవ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ తెలిపారు.

సంబంధిత కథనం