TG Decade Celebrations: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు, సోనియాను ఆహ్వానించనున్న తెలంగాణ ప్రభుత్వం
TG Decade Celebrations: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని వేడుకలకు ఆహ్వానించనున్నారు.
TG Decade Celebrations: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా దశాబ్ది వేడుకల్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెెలంగాణ రాష్ట్ర అకాంక్షను నెరవేర్చిన మాజీ యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని వేడుకలకు ఆహ్వానించనున్నారు. సోనియాను ఆహ్వానించేందుకు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను సిఎస్ శాంతి కుమారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో పదేళ్లు పూర్తి కానున్నాయి. ఉమ్మడి రాజధాని గడువు కూడా తీరినుంది. దీంతో తెలంగాణ దశాబ్ది ఉత్స వాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దశాబ్ది వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. గన్‌పార్క్ అమర వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి, పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు.
వేడుకల నేప థ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రిహార్సల్స్‌ను వీక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ శాంతికు మారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ రవిగుప్తా తో పాటు సీఎస్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీసు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు.
వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కోసం భద్రతా బలగాలు కొన్ని వారాలుగా రిహార్సల్స్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు, టీఎస్‌ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది పాల్గొంటున్నారు.
తెలంగాణకు కొత్త చిహ్నం…
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఎలాంటి ముద్రలు లేకుండా తెలంగాణ ఘన చరిత్రను, వారసత్వాన్ని నేటి తరానికి అందించేలా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నం రూపకల్పనపై సమావేశం అయ్యారు. రాజేశం రూపొందించిన పలు నమూనాలను పరి శీలించి తుది నమూనాపై పలు సూచనలు చేశారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ అధికార చిహ్నంలో ఛార్‌మినార్‌తో పాటు కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి. వాటిని రాచరిక ఆనవాళ్లుగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం, తొలి కేబినెట్ సమావేశంలోనే కొత్త చిహ్నం రూపొందించాలని భావించింది. అధికారిక చిహ్నం ఖరారు కావడానికి సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సోనియాను ముఖ్యమంత్రి కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో సోనియాకు ఆహ్వానం పలకనున్నారు. సోనియాగాంధీని జూన్ 2న జరిగే వేడుకలకు ఆహ్వానించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలని కోరనున్నారు. sa