AP Dasara Holidays : బడులకు దసరా సెలవులు - తరగతులు నిర్వహిస్తే ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి
Dasara Holidays in AP: ఏపీలో ఇవాళ్టి నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 24వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో.. విద్యాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహిస్తే ఫిర్యాదు చేసేలా పలు నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Dasara Holidays in Andhrapradesh : ఏపీలో ఇవాళ్టి నుంచి దసరా సెలవులు మొదలయ్యాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఏపీ విద్యాశాఖ. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రైవేటు విద్యా సంస్థలు సైతం నడుచుకోవాల్సిందే. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా సిలబస్ పూర్తి కాలేదనే నెపంతో, స్టాప్ మీటింగ్, వర్క్ షాప్, రిజిస్టర్ వర్క్ పేరుతో మరియు అదనపు తరగతులు నిర్వహిస్తే సదరు ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఫిర్యాదు చేయాలని సూచించింది. విద్యాశాఖ మండల అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు,బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఫోన్ నెంబర్లను ప్రకటించింది.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్:
1.1902 (కాల్ సెంటర్)
2.1098(child help line
3.0863-2444270
9013133636 (ప్రవీణ్ ప్రకాశ్, IAS
ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా శాఖ మరియు
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి)
పైన పేర్కొబడిన నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు లేదా secy.se.edn@gmail.com కి మెయిల్ చేయవచ్చుని సూచిచింది.