AP BArch Admissions : బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తులకు ఆగ‌స్టు 19 ఆఖ‌రు తేదీ-ap barch admission notification released application last date on august 19th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Barch Admissions : బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తులకు ఆగ‌స్టు 19 ఆఖ‌రు తేదీ

AP BArch Admissions : బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తులకు ఆగ‌స్టు 19 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Aug 13, 2024 03:38 PM IST

AP BArch Admissions : ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడ్ కాలేజీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్‌) డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 19 చివరి తేదీ. ఈ అడ్మిష‌న్లను వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్వహిస్తోంది.

బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తులకు ఆగ‌స్టు 19 ఆఖ‌రు తేదీ
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తులకు ఆగ‌స్టు 19 ఆఖ‌రు తేదీ

AP BArch Admissions : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడ్ కాలేజీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్‌) ఐదేళ్ల రెగ్యూల‌ర్ డిగ్రీ కోర్సు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 19 లోపు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అడ్మిష‌న్లను క‌డ‌ప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్వహిస్తోంది.

అర్హత‌లు

ఇంట‌ర్మీడియ‌ట్ లేదా డిప్లొమా (10+3) పూర్తి చేసి ఉండాలి. నాటా(NATA) ప్రవేశ‌ప‌రీక్షలో అర్హత సాధించి ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు నాటా-2024 స్కోర్ కార్డును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://apsche.ap.gov.in/arch/stureg.php ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

రిజిస్ట్రేష‌న్‌ అండ్ కౌన్సింగ్ ఫీజు

రిజిస్ట్రేష‌న్‌ అండ్ కౌన్సింగ్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్యర్థుల‌కు రూ.1,500, బీసీ అభ్యర్థుల‌కు రూ.1,300, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థుల‌కు రూ.1,000 ఉంటుంది. స్థానికుల‌కు 85 శాతం సీట్లు, నాన్ లోక‌ల్స్‌కు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.

ఫీజులు

రాష్ట్రంలో నాలుగు విద్యా సంస్థల్లో మొత్తం 193 సీట్లు ఉన్నాయి. అలాగే ఈడ‌బ్ల్యూఎస్ కోటా 17 సీట్లు ఉన్నాయి. క‌న్వీన‌ర్ కోటా 176 సీట్లు ఉన్నాయి. అందులో విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర యూనివ‌ర్శిటీ ఆర్కిటెక్చర్ కాలేజీలో 44 సీట్లు ఉండ‌గా, అందులో 22 రెగ్యూల‌ర్, 15 సీట్లు సెల్ఫ్ ఫైనాన్ సీట్లు, నాలుగు ఈడ‌బ్ల్యూఎస్ కోటా సీట్లు ఉన్నాయి. రెగ్యూల‌ర్ సీటు పొందిన వారికి ట్యూష‌న్ ఫీజు రూ.44,500, సెల్ఫ్ ఫైనాన్స్ సీటు పొందిన వారికి రూ. 76,900 ఉంటుంది.

క‌డ‌ప‌లోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలో 44 సీట్లు ఉండ‌గా అందులో 4 ఈడ‌బ్ల్యూఎస్ కోటా సీట్లు ఉన్నాయి. ట్యూష‌న్ ఫీజు రూ.37 వేలు ఉంది. అలాగే గుంటూరు ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కాలేజీలో 44 సీట్లు ఉన్నాయి. అందులో నాలుగు డ‌బ్ల్యూఎస్ కోటా సీట్లు ఉన్నాయి. ట్యూష‌న్ ఫీజు రూ.55 వేలు ఉంది.

భీమవ‌రంలోని ఎంఆర్‌కే కాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో 21 సీట్లు ఉన్నాయి. అందులో 15 క‌న్వీన‌ర్ కోటా (1 ఈడ‌బ్ల్యూఎస్ కోటా), ఆరు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. ట్యూష‌న్ ఫీజు రూ.35 వేలు ఉంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ట్యూష‌న్ ఫీజు అదనంగా 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తిరుప‌తిలోని చ‌ద‌ల‌వాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో 40 సీట్లు ఉన్నాయి. అందులో 28 క‌న్వీన‌ర్, (4 ఈడ‌బ్ల్యూఎస్ కోటా), 12 మేనేజ్‌మెంట్ సీట్లు ఉన్నాయి. ట్యూష‌న్ ఫీజు రూ.35 వేలు ఉంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ట్యూష‌న్ ఫీజు అధ‌నంగా 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ - ఆగ‌స్టు 19
  • స‌ర్టిఫికేట్లు వెరిఫికేష‌న్- ఆగ‌స్టు 20
  • రిజిస్ట్రేష‌న్ చేసుకున్న అభ్యర్థుల జాబితా డిస్‌ప్లే- ఆగ‌స్టు 21 నుంచి ఆగ‌స్టు 22 వ‌ర‌కు
  • రాష్ట్ర ఆర్కిటెక్చర్ ర్యాంక్స్ - ఆగ‌స్టు 24
  • వెబ్ ఆప్షన్ -ఆగ‌స్టు 26 నుంచి ఆగ‌స్టు 27 వ‌ర‌కు
  • ఎంపిక జాబితా విడుద‌ల -ఆగ‌స్టు 29
  • ఎంపికైన అభ్యర్థుల కాలేజీల‌కు వెళ్లి రిపోర్టింగ్ చేయాలి, ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు వెరిఫికేష‌న్‌, ట్యూష‌న్ ఫీజు చెల్లింపు- ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 2 (మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు)
  • త‌ర‌గ‌తుల ప్రారంభం- సెప్టెంబ‌ర్ 2

త‌రువాత మిగిలిన సీట్లకు రెండో ఫేజ్ కౌన్సింగ్ షెడ్యూల్ విడుద‌ల చేస్తారు. అద‌న‌పు సమాచారం కోసం ఫోన్ నెంబ‌ర్‌ 9866032515 Between 10.00 AM and 05.00 PM (During working days only), E-Mail: apbarch.admissions2024@gmail.com సంప్రదించాల‌ని ఏపీ బీఆర్క్ ప్రవేశాల క‌న్వీన‌ర్ జి. విశ్వనాథ‌కుమార్ సూచించారు.

జ‌గదీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం