AP SSC Results 2024 : 599 మార్కులతో ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్- 16 ప్రైవేట్ స్కూల్స్ లో అందరూ ఫెయిల్!-ap 10th results 2024 released girls top in eluru student got state first 17 schools zero pass percentage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Results 2024 : 599 మార్కులతో ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్- 16 ప్రైవేట్ స్కూల్స్ లో అందరూ ఫెయిల్!

AP SSC Results 2024 : 599 మార్కులతో ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్- 16 ప్రైవేట్ స్కూల్స్ లో అందరూ ఫెయిల్!

Bandaru Satyaprasad HT Telugu
Apr 22, 2024 02:48 PM IST

AP SSC Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థిని మవస్వి ప్రథమ ర్యాంకు సాధించింది. మనస్వి 599/600 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. టెన్త్ ఫలితాల్లో 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.

  ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్
ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్

AP SSC Results 2024 : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు 2024 (AP 10th Results)ఇవాళ విడుదలయ్యాయి. పరీక్షలకు 6.23 లక్షల మంది(రెగ్యులర్) విద్యార్థులు హాజరవ్వగా5,34,574 మంది అంటే 86.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్ స్థానంలో నిలవగా, 62.47 శాతం ఉత్తీర్ణతతో కర్నూల్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ ఏడాది కూడా టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే (Girls Top in AP SSC Results)పైచేయిగా నిలిచింది. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా ఉంది. ఈ ఏడాది పది పరీక్షల్లో మొత్తం 600 మార్కులకు 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి ప్రథమ ర్యాంకు(State First Rank) సాధించింది. హిందీ సబ్జెక్ట్(99 మార్కులు) మినహా అన్నింటినీ ఈ విద్యార్థినికి నూటికి నూరు మార్కులు వచ్చాయి. మనస్వి పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్.ఎస్.సి బోర్డు పేర్కొంది.

ఏపీ టెన్త్ ఫలితాల్లో టాప్ టెన్ జిల్లాల ఉత్తీర్ణత శాతాలు(AP SSC Pass Percentaga District Wise)

  • పార్వతీపురం మన్యం జిల్లా - 96.37
  • శ్రీకాకుళం - 93.35
  • కడప- 92.10
  • కోనసీమ జిల్లా - 91.88
  • విజయనగరం - 91.82
  • చిత్తూరు -91.28
  • ప్రకాశం-91.21
  • విశాఖపట్నం-91.15
  • అల్లూరి సీతారామరాజు జిల్లా- 90. 95
  • తిరుపతి - 90.71

17 పాఠశాలల్లో అందరూ ఫెయిల్

రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత(100 Percent Pass Schools) సాధించి కొన్ని పాఠశాలలు రికార్డు సృష్టించాయి. మొత్తం 2,803 పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అంటే జీరో (Zero Pass percent Schools)ఉత్తీర్ణత శాతం వచ్చింది. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ స్కూల్స్(Private Schools) ఉండగా.. మిగిలిన ఒకటి ప్రభుత్వ పాఠశాల కావడం విశేషం.

ఏపీ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉత్తీర్ణత శాతాలు(AP Schools 10th pass Percentage)

  • ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌- 98.43
  • ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌- 98.43
  • ఏపీ ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌- 96.72
  • ఏపీ సోషల్ వెల్ఫేర్‌ స్కూల్స్‌- 94.56
  • ఏపీ మోడల్‌ స్కూల్స్‌- 92.88
  • ఏపీ ఆశ్రమ పాఠశాలలు-90.13
  • ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్- 89.64
  • ఏపీ కస్తూర్బా బాలిక పాఠశాలలు- 88.96
  • ఏపీ ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌- 80.01
  • ఏపీ మున్సిపల్‌ స్కూల్స్‌ -75.42
  • ఏపీ గవర్నమెంట్ హైస్కూల్స్‌- 74.40
  • ఏపీ జిల్లా పరిషత్ హైస్కూల్స్‌- 73.38

మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ

ఏపీ పదో తరగతి ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో సాధించారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు(AP SSC Supplementary Exams ) నిర్వహించనున్నారు. రేపటి(ఏప్రిల్ 23) నుంచి రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మరో 4 రోజుల్లో ఎస్ఎస్.సి వెబ్‌సైట్‌ నుంచి టెన్త్ మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం