AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చూడండి-ap board 10th results to be announced today 22 april moring check the results with this direct links ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చూడండి

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చూడండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 22, 2024 11:34 AM IST

AP Board Class 10th Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) విడుదలయ్యాయి. 11 గంటలకు అధికారులు రిజల్ట్స్ విడుదల చేశారు. హెచ్ టీ తెలుగు వెబ్ సైట్ తో పాటు AP SSC బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి ఫలితాలు - 2024
ఏపీ పదో తరగతి ఫలితాలు - 2024

 

Andhra Pradesh Board 10th Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results ) నేడే(ఏప్రిల్ 22) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను ప్రకటించారు.ఈ ఫలితాలను ఫలితాలను ఎస్ఎస్ సీ బోర్డు సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చెక్ చేసుకోవచ్చు.

How To Check AP 10th Results 2024 : HT తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలు

  • పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాల కాపీని పొందవచ్చు.

AP SSC Results 2024 Website : ఏపీ SSC బోర్డు సైట్ లో ఫలితాలు

  • పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

NOTE : కింద కనిపించే చోట విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల(AP SSC Results) కోసం రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అప్పటితో పోల్చితే…ఈ ఏడాది ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.

 

 

Whats_app_banner

సంబంధిత కథనం