Red Sandalwood Smuggling : వేగంగా వెళ్తున్న కారును ఆపిన పోలీసులు షాక్, రూ.40 లక్షల విలువైన!
Red Sandalwood Smuggling : చిత్తూరులో రూ.40 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 16 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.
Red Sandalwood Smuggling : చిత్తూరులో రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తు్న్న 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. చిత్తూరు పోలీసులకు అందించిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం 6.30 గంటలకు చెన్నై-బెంగళూరు రోడ్డులోని ఎంసీఆర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చిత్తూరు నుంచి చెన్నై వైపు వేగంగా వెళ్తున్న కారును ఆపిన పోలీసులు అందులో రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.
160 కిలోల ఎర్రచందనం పట్టివేత
చిత్తూరులో 16 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 160 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం 6.30 గంటలకు చెన్నై-బెంగళూరు రోడ్డులోని ఎంసీఆర్ క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుంచి చెన్నై వైపు వేగంగా వెళ్తున్న కారు కనిపించింది. చెక్‌పోస్టు వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 5 ఎర్రచందనం దుంగలు లభించాయని చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు.
స్మగ్లర్లపై కేసు నమోదు
కారును ఫాలో అవుతున్న మరో వాహనంలో 7 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. గుడిపాల పోలీస్ స్టేషన్‌లో ఎర్రచందనం స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో రూ. 46 లక్షల విలువైన 30 ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారని ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో పలుమార్లు దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యర్రావారి పాలెం గ్రామంలో పలుమార్లు జరిపిన దాడుల్లో ట్రక్కు, కారు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.