MP Gorantla Madhav : 'చంద్రబాబు చస్తాడు' వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ, రాజకీయ సమాధి అవుతారనే నా ఉద్దేశం-anantapur ysrcp mp gorantla madhav explanation on tdp chandrababu death comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Gorantla Madhav : 'చంద్రబాబు చస్తాడు' వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ, రాజకీయ సమాధి అవుతారనే నా ఉద్దేశం

MP Gorantla Madhav : 'చంద్రబాబు చస్తాడు' వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ, రాజకీయ సమాధి అవుతారనే నా ఉద్దేశం

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2023 04:45 PM IST

MP Gorantla Madhav : చంద్రబాబుపై తన వ్యాఖ్యలు వక్రీకరించాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్
ఎంపీ గోరంట్ల మాధవ్

MP Gorantla Madhav : టీడీపీ అధినేత చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. టీడీపీ తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నిక్లలో మళ్లీ జగన్ సీఎం అవుతారని, చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారనే ఉద్దేశంతోనే మాట్లాడానన్నారు. పద దోషంతో తాను మాట్లాడింది టీడీపీ నేతలకు తప్పుగా కనిపిస్తోందన్నారు. వ్యాఖ్య నిర్మాణ లోపం వల్ల అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారనేదే తన ఉద్దేశం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ రాజకీయ సమాధి అవుతుందని గోరంట్ల మాధవ్ మరోసారి వ్యాఖ్యానించారు.

yearly horoscope entry point

అసలు గోరంట్ల మాధవ్ ఏమన్నారంటే?

వైసీపీ నేతలు సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్... నాలుగున్నరేళ్లలో వైసీపీ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ అని గోరంట్ల అన్నారు. ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే... పంచాయతీ నుంచి మండలాలు, జడ్పీ, మంత్రి వర్గం, డిప్యూటీ సీఎంల వరకూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ దన్నారు.

టీడీపీ నేతలు ఆగ్రహం

స్కిల్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు చనిపోతారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. టీడీపీ నేతలు గోరంట్లపై మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందంటున్నారు. శనివారం చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ ఈ విషయంపై మాట్లాడారు. చంద్రబాబును జైలులోనే చనిపోతారని వైసీపీ నేతలు అంటున్నారని, ఆయన భద్రతపై ఆందోళనగా ఉందన్నారు. జైలు సమీపంలో డ్రోన్ ఎగరడం, ఓ ఖైదీ బటన్ కెమెరాతో పట్టుబడడం భద్రతా వైఫల్యాలు అన్నారు. అయితే జైలు అధికారులు, పోలీసులు మాత్రం చంద్రబాబుకు పటిష్ట భద్రత కల్పించామని, ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదన్నారు.

Whats_app_banner