AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి(10th Class) వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. పదో తరగతి హాల్ టికెట్లను(AP SSC Hall Tickets) రేపు(మార్చి 3) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. పాఠశాలల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE-AP) పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్(AP SSC Exam Schedule) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రేపటి నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో విద్యార్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ (AP SSC Hall Tickets Download)చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవచ్చు.
Step 1 : అధికారిక వెబ్‌సైట్‌ను bse.ap.gov.in సందర్శించండి
Step 2 : మెయిన్ పేజీలో AP SSC హాల్ టికెట్లు డౌన్‌లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : మీ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
Step 4 : తర్వాతి పేజీలో పదో తరగతి హాల్ టికెట్ ను సందర్శించండి.
Step 5 : హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.
సంబంధిత కథనం