AP Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు.. బుధవారం ఈ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం-25 districts of andhra pradesh are likely to receive rain on october 2nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు.. బుధవారం ఈ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం

AP Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు.. బుధవారం ఈ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం

Basani Shiva Kumar HT Telugu
Oct 01, 2024 06:06 PM IST

AP Rain Alert : ఏపీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం 23 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఏపీలో విస్తారంగా వర్షాలు
ఏపీలో విస్తారంగా వర్షాలు (@APSDMA)

అక్టోబర్ 2వ తేదీన బుధవారం నాడు.. మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

అక్టోబర్ 1వ తేదీన మంగళవారం నాడు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం, అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో.. పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరినట్లు అధికారులు వివరించారు.

అటు తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. హైదరాబాద్ సిటీతో సహా.. తెలంగాణ అంతటా వేడిగా ఉంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా జూబ్లీహిల్స్, అమీర్‌పేట ఏరియాలో గాలులు వీస్తున్నాయి. వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.