Breast Milk Production | మహిళల్లో చనుబాల ఉత్పత్తి తగ్గడంపై నిపుణుల మాట ఇదీ!
02 October 2022, 15:59 IST
- అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి పాలను మించి శ్రేష్ఠమైన ఆహారం మరొకటి ఉండదు. అయితే అందరు తల్లుల్లో చనుబాల ఉత్పత్తి ఒకేలా ఉండటం లేదు. కొందరు తల్లుల్లో చనుబాలు తక్కువ ఉత్పత్తి అవుతుంటే, మరికొందరిలో ఓవర్ ఫ్లో కూడా అవుతున్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు తల్లుల్లో చనుబాలు తగ్గుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన UC కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. తక్కువ చనుబాల ఉత్పత్తి కలిగిన 20 ఏళ్ళు పైబడిన గర్భిణీ స్త్రీలు, తల్లులలో పాల ఉత్పత్తిని కొలిచారు. ఏడాది కాలం పాటు అధ్యయనం చేశారు, అదే సమయంలో బిడ్డ బరువును కొలుస్తూ వచ్చారు. చివరకు వారి అధ్యయనంలో తేలిందేమిటంటే మహిళల్లో చనుబాలు తక్కువగా ఉండటానికి కారణం వారిలో జీవక్రియ తక్కువగా జరుగుతుండటమే. తరచుగా అనారోగ్యాల బారినపడితే జీవక్రియ తగ్గుతుంది. ఇటువంటి వారిలో గర్భాధారణ సమయంలో పాల ఉత్పత్తి తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు బ్రెస్ట్‌ఫీడింగ్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.