తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్.. నోట్ల కోసం ట్రాఫిక్‌లో ఎగబడిన జనం

Hyderabad: గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్.. నోట్ల కోసం ట్రాఫిక్‌లో ఎగబడిన జనం

22 August 2024, 17:58 IST

google News
    • Hyderabad: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు పిచ్చి పచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అలజడి సృష్టించింది. అతనిపై చర్యలు ఉంటాయా అని నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్
గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్

గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ యూట్యూబర్‌ హల్‌చల్‌ చేశాడు. ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరాడు. నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టంట్లు చేశాడు. కరెన్సీ నోట్ల కోసం ట్రాఫిక్‌లో జనం ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తూ చేసిన.. వీడియోలు పోస్ట్‌ చేశారు. అయితే.. ఇలా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ చేస్తున్నారు. వాహనాల రద్దీ ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్‌ మధ్యలో యూట్యూబర్ డబ్బును గాలిలోకి ఎగరవేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో "ఇట్స్ మీ పవర్" అనే అకౌంట్ ఉంది. దీన్ని పవర్ హర్ష అలియాస్ మహదేవ్‌ మెయింటేన్ చేస్తున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. చేసిన ఈ స్టంట్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. డబ్బు గాల్లోకి ఎగరేసిన తర్వాత.. సదరు యూట్యూబర్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరమని వీక్షకులను కోరారు. తాను భవిష్యత్తులో విసిరే డబ్బు మొత్తాన్ని కచ్చితంగా అంచనా వేసేవారికి రివార్డ్‌లను ప్రకటించాడు.

తదుపరి వ్యాసం