తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Mp Ticket 2024 : 'ఖమ్మం' ఎంపీ సీటు ఎవరికి..? ఆసక్తికరంగా 'హస్తం' నేతల రాజకీయం

Khammam MP Ticket 2024 : 'ఖమ్మం' ఎంపీ సీటు ఎవరికి..? ఆసక్తికరంగా 'హస్తం' నేతల రాజకీయం

04 February 2024, 9:46 IST

google News
    • Khammam Congress MP Ticket 2024 : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ హాట్ హాట్ గా మారింది. కీలక నేతలు సీటు కోసం రంగంలోకి దిగటంతో…. హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి...?
ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి...?

ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి...?

Khammam Congress MP Ticket 2024 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) విజయం సాధించి అధికారంలోకి రావటంతో సరికొత్త జోష్ తో ఉన్న హస్తం పార్టీ… రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలవటమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి అయింది. చివరి రోజు చాలా మంది నేతలు ఎంపీ టికెట్ల కోసం అప్లికేషన్స్ ఇచ్చారు. అయితే ఈసారి ఖమ్మం ఎంపీ టికెట్ ఖరారు అంశం అత్యంత ఆసక్తిని పుట్టిస్తోంది. కీలక నేతలు రంగంలోకి దిగటంతో… ఈ టికెట్ పై హైకమాండ్ ఏం చేయబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

ఎంపీ సీటుపై కన్నేసిన భట్టి ….

ఖమ్మం ఎంపీ సీటు కోసం రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మేమంటే మేం పోటీ పలువురు నేతలు ముందుకువస్తున్నారు. ఓ అడుగు ముందుకేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని బల ప్రదర్శనకు దిగారు. శనివారం ఖమ్మం నుంచి ఏకంగా 500 వాహనాలతో గాంధీ భవన్ కు వెళ్లి తన దరఖాస్తును ఇచ్చారు. తప్పకుండా ఖమ్మం బరిలో ఉంటానని కూడా చెబుతున్నారు. ఈసారి నందినికే టికెట్ ఇవ్వాలని భట్టి అనుచరవర్గం బలంగా కోరుతోంది. టికెట్ ఖరారు కోసం డిప్యూటీ సీఎం భట్టి కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ్నుంచి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెబుతున్న భట్టి వర్గం… వారు బరిలో లేకపోతే తమకే సీటు ఖరారు చేయాలని అధినాయకత్వాన్నికి విన్నవిస్తున్నారు.

మరోవైపు ఈ సీటుపై కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, ఆ సీటును అధిష్టానం వద్ద అడిగే హక్కు నాదేనని గతంలోనే వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే తప్పుకుంటానని, అలా లేకపోతే తానే బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు. హైకమాండ్ వద్ద గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచారు రేణుకా చౌదరి. మరోసారి ఇక్కడ్నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు.

వీరేకాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సీటు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన సోదరుడిని బరిలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు. సీనియర్ వీ హన్మంతరావుతో పాటు మరికొందరు నేతలు ఈ సీటును ఆశిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలంగా ఉండటంతో సులభంగా విజయం సాధించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సీటును తమకు కేటాయించాలని సీపీఐ కూడా కోరుతోంది.

2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన నామ నాగేశ్వర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి పోటీ చేయగా… 1,68,062 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తదుపరి వ్యాసం