Thatikonda Rajaiah Resigne : బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై - కాంగ్రెస్ వైపు చూపు…?
Thatikonda Rajaiah Resigned to BRS : స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Thatikonda Rajaiah Resigned to BRS : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) పార్టీకి రాజీనామా ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపనున్నారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితమే మంత్రి పొంగులేటిని రాజయ్య కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇదే విషయంపై టీవీ తెలుగుతో మాజీ మంత్రి రాజయ్య మాట్లాడారు. రాజీనామా అంశంపై స్పందిస్తూ… ఇక రాజీనామా అందించలేదని, అదే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. “పార్టీ అధినేత కేసీఆర్ కే రాజీనామా పంపిస్తాను. రాష్ట్ర నాయకత్వం సరైన విధంగా స్పందించటం లేదు. ముఖ్యమంత్రి పదవిపై బీఆర్ఎస్ నేతలు అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామికంగా పార్టీలో మాట్లాడే అకాశం లేదు. మొదట్నుంచి అలాగే ఉంది. నేను అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అనేక పార్టీల నేతలు వస్తారు మాట్లాడుతారు. రాబోయే రోజుల్లో నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. పార్టీ విధివిధానాలు బాగాలేవు. ఇంతకాలం పార్టీకి విధేయుడిగా పని చేశా. తెలంగాణ రాష్ట్ర కోసం రాజీనామా కూడా చేశాను. గత ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవటం మాదిగ అస్తిసత్వం మీద దెబ్పపడింది. మాదిగ సామాజికవర్గానికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిపక్ష స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవంగా తీసుకోవాలి కానీ ప్రభుత్వాన్ని కూలగొడుతామని చెప్పటం సరికాదు. త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను” అని తాటికొండ రాజయ్య చెప్పారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2024) తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను పక్కనపెట్టి… ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. ఈ సమయంలోనే రాజయ్యకు రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని ఇచ్చింది. తీవ్రమైన అసంతృప్తికి లోనైన రాజయ్యను బుజ్జగించింది బీఆర్ఎస్ అధినాయకత్వం. కడియం శ్రీహరి విజయం కోసం పని చేయాలని సూచించింది. ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేశారు. శ్రీహరి విజయం సాధించినప్పటికీ… రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో రాజయ్య రాజకీయ భవిష్యత్తు డైలామాలో పడిపోయింది. వరంగల్ ఎంపీ సీటు విషయంలో కూడా పార్టీ హైకమాండ్ నుంటి క్లారిటీ లేకపోవటంతో రాజయ్య రాజీనామా చేసే ఆలోచనకు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు డాక్టర్ తాటికొండ రాజయ్య. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి కేబినెట్ లో చోటు దక్కించుకోవటమే కాకుండా… తొలి డిప్యూటీ సీఎంగా ఛాన్స్ దక్కించుకున్నారు. కొంతకాలం పాటు పదవిలో ఉన్నప్పటితీ… ఆయన తీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై వేటు వేశారు కేసీఆర్. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన ప్లేస్ లో కడియం శ్రీహరికి మంత్రిగా ఛాన్స్ కల్పించారు.
సంబంధిత కథనం