తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Ratha Saptami Special Buses: 28న రథసప్తమి.. ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులు

TSRTC Ratha Saptami Special Buses: 28న రథసప్తమి.. ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులు

HT Telugu Desk HT Telugu

26 January 2023, 21:21 IST

google News
    • Ratha Saptami  Special Buses:రథసప్తమి సందర్భంగా భక్తులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు,
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, (twitter)

టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు,

TSRTC Special Buses For Ratha Saptami 2023: రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రముఖ ఆలయాలకు 80 స్పెషల్ బస్సులను ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడానికి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు వెల్లడించింది. కరీంనగర్‌ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్‌ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్‌ నుంచి గూడెంకు 5, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను నడుపనుంది.

ఇవే కాకుండా పలు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్‌ మహంకాళి, హిమాయత్‌నగర్‌ బాలాజీ, తదితర ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా స్పెషల్ బస్సులను నడుపనుంది.

బాసరకు ప్రత్యేక బస్సులు…

TSRTC Special Buses వసంత పంచమి వేడుకలు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 26న రిపబ్లిక్‌ డే సెలవు కావడంతో పాటు వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని 20 ప్రత్యేక బస్సులను నడుపనుంది. బుధ, గురు వారాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి. బాసరకు హైదరాబాద్‌ ఎంజిబిఎస్‌ నుంచి 21, జేబీఎస్‌ నుంచి 12, నిజామాబాద్‌నుంచి 45, హన్మకొండ నుంచి 5, జగిత్యాల నుంచి 4 బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే, వర్గల్‌కు సికింద్రాబాద్‌ నుంచి ప్రతీ అరగంటకో బస్సు, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసి బస్సుల్లో ఆన్‌లైన్లో కూడా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నారు.మరిన్నివివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

తదుపరి వ్యాసం