తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : ఇకపై ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత - టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

TSRTC : ఇకపై ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత - టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

31 December 2023, 9:33 IST

    • TSRTC Latest News: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలుపివేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

TSRTC Latest News: ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

"ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. సోమవారం(జనవరి 1, 2024) నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు." అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ప్రకటించారు.

తదుపరి వ్యాసం