TSRTC New Buses : ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న 80 కొత్త ఆర్టీసీ బస్సులు-80 tsrtc new buses with modern features are coming into use from 30 december 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc New Buses : ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న 80 కొత్త ఆర్టీసీ బస్సులు

TSRTC New Buses : ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న 80 కొత్త ఆర్టీసీ బస్సులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 29, 2023 03:58 PM IST

TSRTC New Buses : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని కొత్త బస్సులను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్స్ ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయని ప్రకటించింది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

TSRTC New Buses : ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు TSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోందని వెల్లడించింది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది.

రేపట్నుంచే 80 కొత్త బస్సులు…

అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు.

Whats_app_banner