తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrjc Cet Results 2024 : టీఎస్ఆర్జేసీ సెట్‌ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

TSRJC CET Results 2024 : టీఎస్ఆర్జేసీ సెట్‌ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

11 May 2024, 6:32 IST

google News
    • TSRJC CET Results 2024 Updates: తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఆర్జేసీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. https://tsrjdc.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. 
టీఎస్‌ఆర్జేసీ సెట్‌ ఫలితాలు -2024  విడుదల
టీఎస్‌ఆర్జేసీ సెట్‌ ఫలితాలు -2024 విడుదల

టీఎస్‌ఆర్జేసీ సెట్‌ ఫలితాలు -2024 విడుదల

TSRJC CET Results 2024 : తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఆర్జేసీ సెట్‌ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్ సైట్ లోకి వెళ్లి పరీక్ష రాసిన అభ్యర్థులు స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చని శుక్రవారం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

టీఎస్‌ఆర్జేసీ సెట్‌ -2024 ప్రవేోశ పరీక్షను ఏప్రిల్ 21వ తేదీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదల కాగా… ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 35 టీఎస్ఆర్జేసీ జూనియర్ కాలేజీల్లోప్రవేశాలను కల్పిస్తారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీట్ల కేటాయింపు తొలి కౌన్సెలింగ్ త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. టీఎస్ఆర్జేసీ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ఉంటాయి.

How to Check TSRJC CET Results 2024 : ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • పరీక్ష రాసిన అభ్యర్థులు https://tsrjdc.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో చివరగా ఉండే ఆన్ లైన్ రిజిల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టీఎస్ఆర్జేసీ సెట్ ద్వారా మొత్తం 2,996 ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఎంపీసీ 1496, బైపీసీ 1440, ఎంఈసీ 60 సీట్లు ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహించారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా సబ్జెక్ట్ ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,​బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ , సిద్ధిపేట, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు.

మోడల్ స్కూల్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు…

TS Model School Inter Admissions 2024 : తెలంగాణలోని మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(TSMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి.

ఇందుకు సంబంధించిన దరఖాస్తులు మే 10వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మే 31వ తేదీని తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు.

ముఖ్య వివరాలు:

  • అడ్మిషన్ల ప్రకటన - తెలంగాణ మోడల్ స్కూల్.
  • ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్(ఇంగ్లీష్ మీడియం)
  • తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలు కల్పిస్తారు.
  • ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
  • అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 10, మే, 2024.
  • దరఖాస్తులకు తుది గడువు -31 మే , 2024.
  • ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://telanganams.cgg.gov.in/

తదుపరి వ్యాసం