AP POLYCET Results 2024 : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేసుకోండి
AP POLYCET Results 2024 Updates : ఏపీ పాలిసెట్ - 2024 ఫలితాలు విడుదలయ్యాయి. https://polycetap.nic.in/apssprc.aspx లింక్ తో రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
AP POLYCET Results 2024 : ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం రిజల్ట్స్ ను విడుదల చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఈ ఫలితాలను https://polycetap.nic.in/apssprc.aspx లింక్ తో చెక్ చేసుకోవచ్చు.
ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్షలు మొత్తం 1.42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 1.24లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి పరీక్షలో బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారని ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు.
How to view the AP POLYCET 2024 Result - ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిసెట్ ఎంట్రెన్స్ కోసం ఉచిత కోచింగ్(AP Polycet Free Coaching)ను కూడా సాంకేతి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించింది. 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఈ క్లాసులు జరిగాయి. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మేటీరియల్‌ను కూడా విద్యార్థులకు అందజేసింది.
తెలంగాణ పాలిసెట్ - మే 24న పరీక్ష
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. ఏప్రిల్ 28వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు పాలిసెట్ నిర్వహిస్తారు.
పదో తరగతి(SSC Exams) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు అప్లై చేసుకోవచ్చు. రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఎంట్రెన్స్ పరీక్ష - తెలంగాణ పాలిసెట్ - 2024.
- 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహిస్తారు.
- పదో తరగతి(SSC Exams) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు అప్లై చేసుకోవచ్చు.
- రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
- పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://polycet.sbtet.telangana.gov.in/
- పాలిసెట్ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి
- polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చు.
NOTE : https://polycet.sbtet.telangana.gov.in/#!/index/Registration ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
టాపిక్