TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు-release of 10th class results in telangana 91 percent pass better results than last year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

Sarath chandra.B HT Telugu
Apr 30, 2024 12:04 PM IST

TS SSC Results: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలను మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న అధికారులు
తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న అధికారులు

Telangana SSC 2024Results: తెలంగాణ పదో తరగతి SSC Exams పరీక్షల్లో 91.31శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను Exam Results మంగళవారం విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతిలో 91.31శాతం ఉత్తీర్ణత సాధించారు. BSE Secretary బోర్డు కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారులతో కలిసి మంగళవారం ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌ ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వ హించారు.

ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా, మరో 11,606మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది తెలంగాణలో 4,91,82మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

2023-24 విద్యా సంవత్సరంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 91.31శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలురలో 89.42శాతం, బాలికల్లో 93.23శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది.

తెలంగాణ ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 49.73శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 47.40శాతం, బాలికల్లో 54.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెగ్యులర్ విద్యార్థుల్లో 3927 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. కేవలం 6ప్రైవేట్ పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.

నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99.05శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 65.10శాతం ఉత్తీర్ణత నమోదైంది.

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ స్కూల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి.

ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 91.31కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది మొత్తం 4,94,207మంది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్ధులుగా హాజరయ్యారు. వీరిలో 91.31శాతం ఉత్తీర్ణత నమోదైంది.

తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్ధులు మొదటి స్థానంలో నిలిచారు. జిల్లా నుంచి మొత్తం 8908మంది విద్యార్ధులకు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 8823మంది ఉత్తీర్ణత సాధించారు. 99.05శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో స్థానంలో 98.65శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా, మూడో స్థానంలో 98.27శాతం శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా, 98.16శాతంతో జనగామ జిల్లా నాలుగో స్థానంలో నిలిచాయి.

పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా నుంచి 13,357మంది హాజరుకాగా 8695మంది ఉత్తీర్ణత సాధించారు. 65.10శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జోగులాంబ జిల్లాలో 81.38శాతం, కోమరంభీమ్ ఆసిఫాబాద్‌లో 83.29శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Whats_app_banner

సంబంధిత కథనం