AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?
AP POLYCET Results 2024 Updates: ఏపీ పాలిసెట్ - 2024 పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన ముగిసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు మే 13వ తేదీన వచ్చే అవకాశం ఉంది. https://polycetap.nic.in/Default.aspx లింక్ తో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
AP POLYCET Results 2024 : ఏపీ పాలిసెట్ - 2024కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ(మే5) వెబ్ సైట్ లో ఫైనల్ కీ అందుబాటులోకి రానుంది. https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి తుది కీని చెక్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ ప్రాథమిక కీ(AP POLYCET Key) అందుబాటులోకి వచ్చింది. దీనిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఫైనల్ కీని ఇవాళ వెబ్ సైట్ లో ఉంచనున్నారు.
ఈ ఏడాది ఏపీ పాలిసెట్ -2024(AP POLYCETకు మొత్తం 1,59,989 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీన జరిగిన పరీక్షలకు 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
AP POLYCET Results 2024 Date - ఫలితాలు ఎప్పుడంటే..?
ఏపీ పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన జరిగింది. పరీక్ష జరిగిన నాటి నుంచి పది నుంచి పన్నెండు రోజుల్లో ఫలితాలను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మే 10వ తేదీలోపు ఫలితాలను ప్రకటించేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తుంది. ఇది కుదరకపోతే మే 13వ తేదీన ఫలితాలను ప్రకటించవచ్చని సమాచారం.
How to view the AP POLYCET 2024 Result - ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
- ఏపీ పాలిసెట్ ఫైనల్ కీ ని కూడా పైన పేర్కొన వెబ్ సైట్లలోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా… కౌన్సెలింగ్ ప్రక్రియలో సీట్లను కేటాయిస్తారు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిసెట్ ఎంట్రెన్స్ కోసం ఉచిత కోచింగ్(AP Polycet Free Coaching)ను కూడా సాంకేతి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించింది. 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఈ క్లాసులు జరిగాయి. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మేటీరియల్‌ను కూడా విద్యార్థులకు అందజేసింది.
తెలంగాణ పాలిసెట్ - మే 24న పరీక్ష
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. ఏప్రిల్ 28వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు పాలిసెట్ నిర్వహిస్తారు.
పదో తరగతి(SSC Exams) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు అప్లై చేసుకోవచ్చు. రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చు.