TSPSC Exam Results : టీఎస్పీఎస్సీ నుంచి బిగ్ అప్డేట్ ... మరో 6 ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
17 February 2024, 6:51 IST
- TSPSC Exam Results Updates : పరీక్ష రాసిన ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాలను అందుబాటులో ఉంచింది.
టీఎస్పీఎస్సీ ఫలితాలు
TSPSC Exam Results : కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడ్ అందుకుంటోంది. ఇటీవలే గ్రూప్ 4 ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించగా… తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాల (GRL)ను వెబ్ సైట్ లో ఉంచింది.
తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి ఉద్యోగ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు 2022లో రాగా… గతేడాది పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేయటం, వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం….తాజాగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో త్వరలోనే జాబితాలను ప్రకటించనట్లు తెలిపింది. కమిషన్ అధికారిక https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో వీటిని చెక్ చేసుకోవచ్చు.
లింక్స్ ఇవే….
- 175 టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులకు 2023 జూలై 8న పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితాను ఈ లింక్ పై క్లిక్ చేసి చూసుకోవచ్చు.
- డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 2023 మే 19న పరీక్ష జరిగింది. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ లిస్ట్ ను ఈ లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
- 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2023 జూన్ 17న పరీక్ష జరిగింది. మెరిట్ జాబితా లింక్ ఇదే : https://notificationslist.tspsc.gov.in/notipdf/HO_2422_GRL_DISPLAY.pdf
- ఇంటర్ విద్యలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా… 2023 మే 17న పరీక్ష నిర్వహించారు. ఈ లింక్ పై క్లిక్ చేసి మెరిట్ జాబితాను చెక్ చేసుకోవచ్చు.
- 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2023 మే 16న పరీక్ష నిర్వహించారు. ఈ లింక్ పై క్లిక్ చేసి జనరల్ ర్యాంకింగ్ మెరిట్ లిస్ట్ ను చూడొచ్చు.
- 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి జూన్ 28న పరీక్ష నిర్వహించారు. https://notificationslist.tspsc.gov.in/notipdf/AMVI_3122_GRL_DISPLAY.pdf లింక్ పై క్లిక్ చేసి జాబితాను చెక్ చేసుకోవచ్చు.
పై పరీక్షలు రాసిన అభ్యర్థులు… వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఈ జాబితాలను చెక్ చేసుకోవచ్చు. మొదటగా https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ ఓపెన్ అయ్యే విండో లోనే ఈ నోటిఫికేషన్లు మెరిట్ జాబితాల లింక్స్ కనిపిస్తాయి. వాటిపై నొక్కితే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ ర్యాంక్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు.
ఇటీవలే గ్రూప్ 4 ఫలితాలు…
ఇటీవలే తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు ర్యాంకుల వివరాలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులను అందుబాటులో ఉంచింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడించనుంది టీఎస్పీఎస్సీ.
రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా..... జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 మెరిట్ జాబితా వివరాలను ఇవాళ విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులకు ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల వయోపరిమితిని పెంచనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.