TSPSC OTR : టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నారా..? ముందుగా OTR పూర్తి చేయండి, ప్రాసెస్ ఇదే
02 March 2024, 13:14 IST
- TSPSC One Time Registration Process : టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నారా..? అయితే మీరు ముందుగా ఓటీఆర్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ జనరేట్ అయితేనే... ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి వీలవుతుంది. ఇక గతంలో ఓటీఆర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్డేట్ చేయటం తప్పనిసరి.
టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ప్రాసెస్
TSPSC One Time Registration : ఓటీఆర్...తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ఇదీ తప్పనిసరి. కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు ఈ ఓటీఆర్(One Time Registration) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో ఓటీఆర్ జనరేట్ చేసుకున్న వాళ్లు... ఇప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడిట్ చేసుకోకపోతే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
ఎడిట్ తప్పనిసరి.. ఎందుకంటే..?
గ్రూపు ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో నమోదు చేసుకున్న అభ్యర్థులు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు. ఈక్రమంలో ఇదివరకు ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులంతా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వివరాలను అప్‌లోడ్ చేయాల్సిందే. అప్పుడే ఓటీఆర్ ప్రక్రియ అప్డేట్ అవుతుంది. నమోదుతో పాటు ఎడిట్ ప్రక్రియ పూర్తి అయితే.. కమిషన్ ఇచ్చే ఉద్యోగ ప్రకటనల సమాచారం మొబైల్ నెంబర్ కు సందేశాల రూపంలో వస్తాయి.
OTR నమోదు ఇలా చేసుకోండి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు రాయాలనుకునే అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
'New Registration (OTR)' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్ కు కోడ్ వస్తుంది. అది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
మీరు నింపాల్సిన ఫామ్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
విద్యా అర్హతలు, స్థానికత అనేది చాలా కీలకం. జాగ్రత్తలుగా నింపాలి.
ప్రాసెస్ పూర్తిగా అయినపోయిన తరువాత మీకు ఓటీఆర్ జనరేట్ అవుతుంది.
ఇది భవిష్యత్తులో పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఇక ఇప్పటికే నమోదు చేసిన వాళ్లు కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
https://www.tspsc.gov.in/ లోకి వెళ్లిన తర్వాత Edit One Time Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ ఓటీఆర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంట్రీ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.