తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Exam Fee : పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే

TS SSC Exam Fee : పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే

02 November 2023, 19:59 IST

google News
    • Telangana SSC Exam Fees Schedule 2024 : పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం ప్రకటనను విడుదల చేసింది.
పదో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ఫీజు షెడ్యూల్ విడుద‌ల‌
పదో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ఫీజు షెడ్యూల్ విడుద‌ల‌

పదో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ఫీజు షెడ్యూల్ విడుద‌ల‌

10th Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వ పరీక్షల విభాగం. వార్షిక ప‌రీక్ష‌ల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక రూ. 50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రూ. 200తో డిసెంబ‌ర్ 11, రూ. 500 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.

రెగ్యూల‌ర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలని ప్రకటనలో వెల్లడించారు. ఇక మూడు సబ్జెక్టులు, అంత కంటే త‌క్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110 చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 ను చెల్లించాలని వెల్లడించారు. వొకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలో మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇక పూర్తి వివరాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్

TS Inter Exam Fee : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీలను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. నవంబర్‌ 14వ తేదీ వరకు ఫీజు గడువును నిర్ణయించింది. రూ.100 జరిమానాతో నవంబర్ 16వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.500 ఫైన్ తో నవంబర్ 25 వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు.. రూ.1000 జరిమానాతో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించింది.

రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మొదటి సంవత్సరం విద్యార్థులు(రెగ్యూలర్) రూ. 510, ఒకేష‌న‌ల్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 730, రెండో ఏడాది ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాల‌ని వెల్లడించింది.

తదుపరి వ్యాసం