తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set 2024 : జులై 8తో ముగియనున్న టీఎస్ సెట్ అప్లికేషన్లు, దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే

TS SET 2024 : జులై 8తో ముగియనున్న టీఎస్ సెట్ అప్లికేషన్లు, దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే

07 July 2024, 19:25 IST

google News
    • TS SET 2024 : టీఎస్ సెట్-2024 అప్లికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. అయితే ఆలస్య రుసుముతో అభ్యర్థులు ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జులై 8తో ముగియనున్న టీఎస్ సెట్ అప్లికేషన్లు, దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే
జులై 8తో ముగియనున్న టీఎస్ సెట్ అప్లికేషన్లు, దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే

జులై 8తో ముగియనున్న టీఎస్ సెట్ అప్లికేషన్లు, దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే

TS SET 2024 : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 8తో ముగుస్తుంది. టీఎస్ సెట్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు http://telanganaset.org/ టీఎస్ సెట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా డైరెక్ట్ లింక్ ను పొందవచ్చు. అయితే రూ.1500 ఆలస్య రుసుముతో జులై 16 వరకు , రూ.2000 ఆలస్య రుసుముతో జులై 26 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వహకులు తెలిపారు.

అప్లికేషన్ లో మార్పు చేర్పులకు ఎడిట్ విండో ఆగస్టు 8న ప్రారంభమై ఆగస్టు 9, 2024న ముగుస్తుంది. ఆగస్టు 20 నుంచి టీఎస్ సెట్-2024 హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. జనరల్ స్టడీస్ లో 29 సబ్జెక్టులు సీబీటీ విధానంలో టీఎస్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వెలుపల రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను రిజర్వేషన్లతో సంబంధం లేకుండా జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు.

టీఎస్ సెట్ 2024 ఎలా రిజిస్టర్ చేసుకోవాలి

Step 1 : అభ్యర్థులు టీఎస్ సెట్ http://telanganaset.org/ అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో ఉన్న టీఎస్ సెట్ 2024 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 4 : ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.

Step 5 : అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Step 6 : సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.

పరీక్ష ఫీజు జనరల్ కేటగిరీకి రూ.2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ/ వీహెచ్/ హెచ్ఐ/ ఓహెచ్/ ట్రాన్స్జెండర్కు రూ.1000. అభ్యర్థులు పరీక్ష ఫీజును క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డు / యూపీఐ / నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు, వర్తించే అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు అభ్యర్థి క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు / యూపీఐ / నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా డెబిట్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు టీఎస్ సెట్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచారు. 1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలతో పాటే ఫైనల్ కీని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వెబ్ సైట్ లో ఫైనల్ కీ అందుబాటులో ఉంది. మెయిన్స్ ఎంపికైన వారి హాల్ టికెట్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు.

అక్టోబరులో మెయిన్స్ పరీక్షలు

మరోవైపు ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం