తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet 2023 : ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది - ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు

TS ICET 2023 : ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది - ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు

14 July 2023, 13:46 IST

google News
    • TS ICET Counselling 2023 Updates : టీఎస్ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 14 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదలైంది.
టీఎస్ ఐసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్
టీఎస్ ఐసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్

టీఎస్ ఐసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్

TS ICET Counselling schedule 2023 : తెలంగాణ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు, కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తూ గురువారం వివరాలను వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 14 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 25వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్‌ వాకాటి కరుణ తెలిపారు.

టీఎస్ ఐసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ :

ప్రవేశ పరీక్ష - తెలంగాణ ఐసెట్ - 2023

రిజిస్ట్రేషన్లు - ఆగస్టు 14 - ఆగస్టు 18, 2023

ధ్రువపత్రాల వెరిఫికేషన్ - ఆగస్టు 16 నుంచి 19

వెబ్ ఆప్షన్లు - ఆగస్టు 16 నుంచి 21

తొలి విడత సీట్ల కేటాయింపు - ఆగస్టు 25, 2023

తుది విడత కౌన్సెలింగ్ - సెప్టెంబర్‌ 1, 2023

తుది విడత వెబ్ ఆప్షన్లు - సెప్టెంబర్‌ 1 నుంచి 3,

తుది విడత సీట్ల కేటాయింపు - సెప్టెంబర్ 7, 2023

స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు - సెప్టెంబర్ 8, 2023

ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

మరోవైపు తెలంగాణ ఈసెట్ షెడ్యూల్ కూడా విడుదలైంది. దీని ద్వారా బీటెక్, బీఫార్మ‌సీ రెండో సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌ు కల్పిస్తారు. షెడ్యూల్ విడుద‌లైంది. జులై 29 నుంచి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. జులై 31 నుంచి ఆగ‌స్టు 2వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీలన ఉంటుంది. జులై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఆగ‌స్టు 8వ తేదీన ఈసెట్ అభ్య‌ర్థుల‌కు తొలి విడుత సీట్ల‌ను కేటాయించ‌నున్నట్లు పేర్కొన్నారు.. ఆగ‌స్టు 20 నుంచి ఈసెట్ తుది విడుత ప్ర‌వేశాలకు అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం