TS ICET Results : తెలంగాణ ఐసెట్ - 2023 ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే-ts icet 2023 results announced check at icettscheacin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Icet-2023 Results Announced Check At Icet.tsche.ac.in

TS ICET Results : తెలంగాణ ఐసెట్ - 2023 ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 29, 2023 03:51 PM IST

TS ICET-2023 Results Updates: టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలు వచ్చేశాయ్. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు - 2023
తెలంగాణ ఐసెట్ ఫలితాలు - 2023 (unsplash)

TS ICET Results Updates 2023: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయ్. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రిజల్స్ ను ప్రకటించారు. గత నెల 26, 27 తేదీల్లో నిర్వ‌హించిన టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో తొలి మూడు ర్యాంకుల్లోనూ అబ్బాయిలే టాప్ ప్లేస్ లో నిలిచారు. నూకల శరణ్‌కుమార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా.. సాయినవీన్‌కు రెండు, రవితేజకు మూడో ర్యాంకులో మెరిశారు.

ట్రెండింగ్ వార్తలు

ఇలా చెక్ చేసుకోండి…

అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

ఇక మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. జూన్ 5వ తేదీ నుంచి క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు, రెస్సాన్స్ షీట్ల‌ను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇవాళ ఫైనల్ కీతో పాటు తుది ఫలితాలను ప్రకటించారు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించనున్నారు.

AP ICET Results 2023: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ - 2023 ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయి. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు గాను... 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

- Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

- Registration Number , హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

- View Results ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.

- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా ఉంచుకోవాలి.

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. తాజా ఫలితాల్లో జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) టాపర్ గా నిలవగా… సికింద్రాబాద్ కు చెందిన సాయివెంకట కార్తీక్ స్టేట్ సెకండ్ టాపర్ గా ఉన్నారు.

WhatsApp channel