తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. ఆయన కేసీఆర్‌కు దగ్గరి బంధువు

Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. ఆయన కేసీఆర్‌కు దగ్గరి బంధువు

HT Telugu Desk HT Telugu

20 March 2023, 20:11 IST

google News
  • TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు వివర్శలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కు టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌ దగ్గరి బంధువు అని రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌ .. కేసీఆర్(KCR)కు దగ్గరి బంధువు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ చేసిన ప్రతిపాదనతోనే టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌(TSTS Chairmen)గా జగన్‌ ను సీఎం కేసీఆర్ నియమించారని తెలిపారు. ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్‌ కార్పొరేషన్ పని చేస్తోందన్నారు. టీఎస్‌టీఎస్‌ ఉద్యోగి రాజశేఖర్ కు టీఎస్పీఎస్సీ డైరెక్ట్ యాక్సిస్ ఎలా లభించిందో చెప్పాలని రేవంత్ అడిగారు. నిజామాబాద్ బాన్సువాడలో హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

'ఐటీ శాఖ కింద టీఎస్‌టీఎస్‌ పనిచేస్తోంది, కంప్యూటర్ల కొనుగోలు, నిర్వహణ టీఎస్‌టీఎస్‌ బాధ్యతే. ఐటీశాఖ అనుమతి తీసుకున్నాక కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు. టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌ కేసీఆర్‌కు దగ్గరి బంధువు. కేటీఆర్‌ ప్రతిపాదనతో సీఎం కేసీఆర్ నియమించారు. ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్‌ కార్పొరేషన్ పనిచేస్తోంది. కంప్యూటర్ల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి 2017లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2021లో నియామకమైన తనకు ఘటనతో సంబంధమేంటని జగన్‌ వాదిస్తున్నారన్నారు. కేటీఆర్(KTR) వద్ద పనిచేసే తిరుపతి టీఎస్‌టీఎస్‌ పై ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మల్యాలకు చెందిన రాజశేఖర్ రెడ్డిని తిరుపతి నియమించారని చెప్పారు. పేపర్ లీకేజీతో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతుమ్నారని రేవంత్ అన్నారు. ఏ శాఖలో అయినా కంప్యూటర్లు టీఎస్‌టీఎస్‌ ద్వారానే పెట్టాలని, రాజశేఖర్ రెడ్డి కంప్యూటర్ల నిర్వహణ, మరమ్మత్తులు చూస్తారని తెలిపారు.

కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ(IT Department) ఆడిట్ జరగాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఆడిట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు రావడానికి బాధ్యత ఐటీ మంత్రిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు సిట్ నోటీసులు(SIT Notices) ఇవ్వడంపై స్పందించారు. ఆ విషయం ఊహించినదేనని తెలిపారు. తనకు ఇప్పటి వరకూ సిట్ నోటీసులు చేరలేదని, వస్తే స్వాగతిస్తానని వెల్లడించారు.

మరోవైపు పేపర్ లీకేజీ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్ కు సంబంధించి.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తామని ఏసీపీ స్థాయి అధికారి నోటీసులుఇచ్చారు.

తదుపరి వ్యాసం