TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
SIT Notices To Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ(Paper Leak) ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్(SIT) దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్ కు సంబంధించి.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తామని ఏసీపీ స్థాయి అధికారి రేవంత్ రెడ్డికి నోటీసు పంపారు.
రేవంత్ రెడ్డి ఆదివారం నాడు పేపర్ లీక్ ఘటనపై ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ సొంతమండలంలో గ్రూప్ 1 పరీక్ష(Group 1) రాసిన వారిలో చాలా మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని వ్యాఖ్యలు చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఈ కామెంట్స్ సిట్ దృష్టికి వెళ్లాయి. ఎవరెవరికి వందకు పైగా మార్కులు వచ్చాయి? ఆ మార్కులు పొందిన వారు ఎవరు? అనే వివరాలు సమర్పించాలని సిట్ నుంచి రేవంత్ రెడ్డి నోటీసులు వెళ్లాయి. ఇలా.. వ్యాఖ్యలు చేసినవారికి కూడా సిట్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవే..
టీఎస్పీఎస్సీ(TSPSC) నిందితులు ఉన్న చంచలగూడ జైలుకు మధ్యవర్తిత్వం చేసేందుకు ఎవరు వెళ్లారని రేవంత్ రెడ్డి అడిగారు. పేర్లు బయటపెడితే.. చంపేస్తామన్నారని.., అన్ని బయటకు రావాలన్నారు. చంచల్ గూడ సందర్శకుల జాబితాను చూపించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేయాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్((TSPSC Paper Leak) దారుణమని మండిపడ్డారు. పేపర్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్(KTR) అతి తెలివి తేటలు ప్రదర్శించారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టు అయిన తొమ్మిది మంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2015 నుంచి పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్ చొరవతో ఇరవై మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలని, లేదంటే.. లాంగ్ లీవ్(Long Leave)లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలని చెప్పారు. టీఎస్పీఎస్సీలో పని చేసే.. మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం, రజనీకాంత్ రెడ్డికి నాల్గొ ర్యాంక్ రావడం వెనక కారణాలు ఏంటో తెలియాలన్నారు. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారిలో 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనక ఏం జరిగింతో తేలాలని రేవంత్ రెడ్డి అన్నారు.
సంబంధిత కథనం