TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఇలా లీక్ చేశారు..! రెండో రోజు సిట్ విచారణ
TSPSC Paper Leak : తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలన సృష్టించింది. నిందితులను సిట్ రెండో రోజు విచారించింది. పలు కీలక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది.
TSPSC Paper Leak : టీఎస్పీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజు సిట్ విచారణ(SIT Enquiry) చేసింది. తొమ్మిది మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. శనివారం మెుదటి రోజు నిందితులను విచారించగా.. ప్రశ్నాపత్రాలు ఎలా కొట్టేశారనే దానిపై నిందితులను ప్రశ్నించారు. కానీ సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది. రెండో రోజు కూడా ఈ విషయాల మీద ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. రాజశేఖర్ చేతికి పాస్ వర్డ్ ఎలా వచ్చిందనే అంశంపై సిట్(SIT) ప్రశ్నించింది. రెండో రోజు కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం రెండో రోజు విచారణ ముగిసింది.
ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్లు దొంగిలించినట్టుగా నిందితుడు రాజ శేఖర్ విచారణలో అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఆఫీస్ టైమ్ అయిపోయిన తర్వాత కూడా ప్రవీణ్, రాజశేఖర్ అక్కడే ఉంటూ.. ప్రశ్నాపత్రాలు సేకరించినట్టుగా గుర్తించారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్.. రెండు గంటలపాటు ముగ్గురు నిందితులను విడివిడిగా ప్రశ్నించారు. ఆ తర్వాత మరొసారి ముగ్గురిని కలిపి ప్రశ్నించారు.
క్వశ్చన్ పేపర్స్ ఎలా లీక్ చేశారు? దీని వెనకు ఎవరి హస్తం ఉంది? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? అనే అంశాల మీద నిందితులను సిట్ ప్రశ్నించింది. ఐపీ అడ్రస్ లు మార్చేసి.., కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్లు దొంగిలించినట్టుగా రాజశేఖర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ(Question Paper Leak) వ్యవహారంపై సిస్టం అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లను విచారించి.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది.
రాజశేఖర్, ప్రవీణ్, రేణుక , డాక్యా, రాజేశ్వర్, గోపాల్, రాజేంద్ర, నిలేష్, శ్రీనివాస్ పాత్రలపై సిట్ అధికారులు వాంగ్మూలం రికార్డు చేశారని సమాచారం. రాజశేఖర్ నుంచి ప్రవీణ్ కు అతడి నుంచి రేణుక ద్వారా క్వశ్చన్ పేపర్లు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఏఈ పరీక్ష పేపర్(AE Question Paper) తో పాటుగా టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు కాపీ చేసినట్టుగా సిట్ నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చేసింది.
ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పేపర్లు నిందితులు కాపీ చేసి వాట్సాప్(Whatsapp) ద్వారా షేర్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కంప్యూటర్లను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. వాట్సాప్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ ఎంతమంది షేర్ అయింది.. లాంటి వివరాలను సిట్ అధికారులు రాబడుతున్నారు. ఎక్కువగా సాంకేతిక అంశాలు, ఆర్థిక లావాదేవీల మీద సిట్ దృష్టిపెట్టింది.
సంబంధిత కథనం
టాపిక్