T-SAT: ఉద్యోగ అభ్యర్థుల కోసం ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్.. మాక్ టెస్టులు కూడా…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. భారీ స్థాయిలో కొలువులను భర్తీ చేస్తుండటంతో.. టీశాట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.
.
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న పలు ఉద్యోగాల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది టీ-శాట్. విషయ నిపుణులతో పాఠాలను చెప్పిస్తోంది. ఇందులో గ్రూప్స్, టెట్, పోలీసు ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా అంశాలను భోదిస్తున్నారు. అయితే ఉద్యోగ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది టీశాట్. దాదాపు 50 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రూపొందిస్తోంది. ఇది గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆన్ లైన్ లో నమూనా పరీక్ష (మాక్ టెస్ట్)లకు సైతం హాజరయ్యే వీలును కల్పిస్తోంది.
త్వరలోనే అందుబాటులోకి...
టీశాట్ తలపెట్టి క్వశ్చన్ బ్యాంక్.. ప్రస్తుతం తయారీ దశలో ఉంది. జూన్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టీశాట్ వర్గాలు చెబుతున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన సిలబస్ ఆధారంగానే ఈ ప్రశ్నాలు తయారుచేస్తారని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్, హిస్టరీ, ఎకానమీ,గణితం, ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ఈ ప్రశ్నల నిధిని రూపొందిస్తున్నారు.
ఇలా చేస్తేనే అవకాశం...
ఈ ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్ ను ఉపయోగించుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. టీశాట్ మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చే క్వశ్చన్ బ్యాంక్ కోసం అభ్యర్థులు టీశాట్ మొబైల్, వెబ్ అప్లికేషన్లలో ఫోన్ నంబర్ లేదా ఈ–మెయిల్ అకౌంట్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే మాక్ టెస్ట్ లు వినియోగించుకునే అకాశం ఉంటుంది.
మార్కుల జాబితా కూడా...
అభ్యర్థలు రాసే మాక్ టెస్టుల్లో సాధించిన మార్కలు కూడా ఇచ్చేలా టీశాట్ కసరత్తు చేస్తోంది. ప్రతి సెషన్ కు టీశాట్ క్వశ్చన్ బ్యాంక్‌లోంచి నిర్ణీత సంఖ్యలో ప్రశ్నలు విడుదల చేస్తారు. వాటికి అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ ముగిశాక అభ్యర్థి ఈ–మెయిల్ ఐడీకి మార్కుల జాబితాను పంపిస్తారు. ఈ టెస్టులు అభ్యర్థులకు ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నోట్: టీ- శాట్ ఆన్ లైన్ పాఠాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం