Padayatra In Heavy Rain | వర్షంలోనూ వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి-padayatra in heavy rain ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Padayatra In Heavy Rain | వర్షంలోనూ వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి

Padayatra In Heavy Rain | వర్షంలోనూ వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి

Mar 18, 2023 09:36 AM IST Muvva Krishnama Naidu
Mar 18, 2023 09:36 AM IST

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కేసీఆర్ ఫ్యామిలీకి కనక వర్షం కురిపించే కామధేనువుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిజామబాద్ జిల్లాలో సాగుతున్న హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా బోధన్ నియోజకవర్గం సారంగపూర్ వద్ద ప్రాణహిత ప్రాజెక్టు 20వ ప్యాకేజ్ పాయింట్‌ను పరిశీలించి అక్కడి రైతులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ దమ్ముంటే బహిరంగంగా చర్చకు రెడీ కావాలని అన్నారు. కాళేశ్వరంపై శ్వేతపత్రం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అటు భారీగా వర్షం కురుస్తున్నా రేవంత్ రెడ్డి పాదయాత్ర మాత్రం ఆపలేదు. జోరు వానలో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ పాదయాత్ర కొనసాగించారు. దీంతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం వెల్లువిరిచింది.

More